Bharat Bandh: రేపు, ఎల్లుండి భారత్ బంద్.. కానీ అక్కడ మాత్రం

 


Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ.. రేపు, ఎల్లుండి భారత్ బంద్.. కానీ అక్కడ మాత్రం

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు రేపు (మార్చి 28), ఎల్లుండి (మార్చి 29) భారత్ బంద్ (Strike) కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయస్ అసోసియేషన్ కూడా బ్యాంకింగ్(Banking) సెక్టార్ ఈ సమ్మెలో పాల్గొంటుందని తెలిపింది. బంద్ నేపథ్యంలో కస్టమర్లు ముందుగానే సిద్ధం కావాలని పిలుపునిచ్చాయి. లాభాల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్రపూరితంగానే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు, రవాణా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కోల్, స్టీల్, ఆయిల్, టెలికాం, పోస్టల్, ఇన్‌కమ్ ట్యాక్స్, కాపర్, వంటి రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ మేరకు సమ్మె నోటీసులను జారీ చేశాయి. రైల్వే, రక్షణ రంగాలకు చెందిన సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు (support) ఇచ్చాయి. దేశవ్యాప్తంగా సమ్మె జరిగే వందల చోట్ల భారీ జనసమీకరణకు సహకరిస్తామని వెల్లడించాయి

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ కూడా ఈ సమ్మె వల్ల తన బ్యాంకింగ్ సర్వీసులు ప్రభావితమవుతుందని తెలిపింది. ఈ రెండు రోజుల సమ్మె నేపథ్యంలో బ్యాంక్ శాఖల సాధారణ కార్యకలాపాలలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని వివరించింది. మరోవైపు ఈ రెండు రోజులు ప్రభుత్వ ఉద్యోగులందరూ కచ్చితంగా ఆఫీసులకు రావాలని, తప్పనిసరిగా డ్యూటీకి రిపోర్టు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Bank Strike News: సమ్మె బాట పట్టనున్న బ్యాంక్ ఉద్యోగులు

Bank Strike News: బ్యాంక్ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో యూనియ‌న్ ఫోర‌మ్ ఆఫ్ బ్యాంక్ యూనియ‌న్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. జాతీయ స్థాయిలో ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ లు ఈ బంద్ లో పాల్గొననున్నాయి. బ్యాంక్ ఉద్యోగు సమ్మెతో ఏటీఎం కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడనుంది. ఖాతాదారులు ముందస్తుగానే అవసరానికి కావాల్సిన డబ్బులు డ్రా చేసుకోవాలని బ్యాంక్‌ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.. 

ALSO READ: 

SBI కీల‌క నిర్ణ‌యం, బ్యాంక్ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌!!

మీ SBI అకౌంట్ BALANCE ఎంత? సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇలా

SBI ఖాతాదారులకు స్పెషల్ ఆఫర్

SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!

SBI: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే SBI అందించే ఈ ఆఫర్ మీ కోసమే.

SBI Car Loan: కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad