Fourth Wave In India: ఫోర్త్ వేవ్‌పై భయం వద్దు-- Bharath biotech

 Fourth Wave In India: ఫోర్త్ వేవ్‌పై భయం వద్దు

కరోనా అదుపులో వున్నా అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం అందరినీ జాగ్రత్తలు పాటించమంటోంది. దేశంలో తాజాగా 3 వేల లోపే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 2075 కరోనా కేసులు నమోదవగా, 71 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరగా, 5,16,352 మంది మరణించారు. మొత్తం కేసుల్లో 4,24,61,926 మంది బాధితులు కోలుకోగా, 27,802 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఫోర్త్ వేవ్ పై తన అభిప్రాయం తెలిపారు భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణా ఎల్లా. న్యూఢిల్లీలో పోలియో పై ప్రముఖ వైరాలజిస్ట్, ప్రొఫెసర్ జాకబ్ జాన్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణా ఎల్లా.

నాలుగవ విడత కరోనా విజృభించనుంది. దీని గురించి భయపడాల్సిందేమీ లేదన్నారు. నాలుగవ విడత “కరోనా” వైరస్ ప్రభావం అంత తీవ్రంగా ఉండదు.• ఇప్పటికే దేశమంతా “కరోనా” వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. “కరోనా” వైరస్ ని ఎదుర్కొనేందుకు పూర్తి సంసిద్ధతతో ప్రజలున్నారు. మూడో డోసు వ్యాక్సిన్ వేసుకోవడం కూడా మంచిది. మాస్క్ లు కొనసాగించడం, శానిటైజర్ వాడడం చాలా మంచిదన్నారు. నాజల్ వ్యాక్సిన్(ముక్కులో డ్రాప్స్) పై “భారత్ బయోటిక్” పరిశోధనలు కొనసాగిస్తోందన్నారు. నాజల్ వ్యాక్సిన్ ఆవిష్కరణ పై ఇప్పుడేమీ మాట్లాడనన్నారు భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణా ఎల్లా. ఇదిలా వుంటే.. దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.35గా ఉన్నదనివెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,81,04,96,924 కరోనా వ్యాక్సిన్లు వేశామని కేంద్రం తెలిపింది.

READ ALSO:

అన్నం తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందా..? తాజా పరిశోధనల్లో సరికొత్త విషయాలు..

లిక్విడ్ డైట్.. ఆరోగ్యకరమా? హానికరమా?

మీరు తీసుకునే తేనే స్వచ్చమైనదేనా ... ఇలా తెలుసుకోండి

నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే

గోళ్ళని బట్టి ఆరోగ్యం గురించి ఇలా తెలుసుకోవచ్చు


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad