Geomagnetic storm: సూర్యుడిలో భారీ విస్ఫోటనం.. గంటకు 2.85 లక్షల కి.మీ. వేగంతో గురువారం భూమిపైకి సౌర తుఫాను

 సూర్యుడిలో భారీ విస్ఫోటనం.. గంటకు 2.85 లక్షల కి.మీ. వేగంతో గురువారం భూమిపైకి సౌర తుఫాను

Geomagnetic storm to hit Earth at 21,85,200 kmph on Thursday

సూర్యుడి ఉపరితలంపై చోటుచేసుకుంటున్న భారీ మార్పులను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌర చక్రంలో పరిస్థితులు ప్రభావంతో సూర్యుడి మరింత వేడెక్కుతున్నాడు. దీని కారణంగా సూర్యుడి ఉపరితలంపై కరోనల్ మాస్ ఎజెక్షన్‌ అనే విస్ఫోటనం ఏర్పడిందని, అది భూమివైపు అత్యంత వేగంగా దూసుకొస్తుందని తెలిపారు. కరోనల్ మాస్ ఎజెక్షన్‌ గురువారం భూమిని తాకుతుందని కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ హెచ్చరించింది.

సూర్యుని ఉపరితలంపై సంభవించే అతిపెద్ద విస్ఫోటనాలలో ఒకటైన కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ).. ఒక బిలియన్‌ టన్నుల పదార్థాన్ని కలిగి ఉంటుంది. అంతరిక్షంలో గంటకు అనేక మిలియన్ మైళ్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఈ సౌర పదార్థం అంతర గ్రహాల మాధ్యమం ద్వారా ప్రయాణించి.. దాని మార్గంలో ఏదైనా గ్రహం లేదా శాటిలైట్లు అడ్డువచ్చినా ప్రభావితం చేస్తుంది.

Also read

కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్

SBI: రూ.342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!

సూర్యుడిపై పేలుళ్లు సంభవించినప్పుడు అంతరిక్షంలోకి క్షణాల్లో సౌర గాలులు దూసుకెళ్తాయి. ఈ చర్యనే కరొనల్ మాస్ ఇజెక్షన్ (coronal mass ejection) అంటారు. వాస్తవానికి శక్తివంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్‌ భూమిని దాటినప్పుడు.. భూ కక్ష్యలో ఉండే శాటిలైట్స్‌లోని ఎలక్ట్రానిక్‌ వస్తువులకు నష్టం కలిగిస్తుంది. దీంతో భూమిపై రేడియో కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్‌కు తీవ్ర విఘాతం ఏర్పడుతుంది.

మార్చి 28న సూర్యునిపై 12975, 12976 రీజియన్‌ల నుంచి మంటలు విడుదలయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఒకవేళ, ఈ మంటలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకితే సౌర తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని ఐఐఎస్ఈఆర్ తెలిపింది. వివరాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు

ALSO READ

ఏడేళ్లలో మీ పిల్లల పేరుతో రూ.11 లక్షలు రిటర్న్స్ పొందొచ్చు

SBI ATM ఫ్రాంచైజీ: నెలకి రూ.80 వేలు సంపాదించే అవకాశం

APGLI Final Payment Calculator


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad