Honey Test: మీరు తీసుకునే తేనే స్వచ్చమైనదేనా ... ఇలా తెలుసుకోండి

Honey Test: మీరు తీసుకునే తేనే స్వచ్చమైనదేనా ... ఇలా తెలుసుకోండి 

Honey Test: తేనె (Honey) ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలోని కొవ్వును కరిగించడం నుంచి నిరోధక శక్తి పెంచే వరకు ఇలా తేనెతో ఎన్నో లాభాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా కరోనా (Corona) సమయంలో తేనెను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు కూడా సూచించారు. తేనె ప్రకృతి సిద్ధంగా లభించేదని మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న తేనె కలుషితమవుతుంది. మరి మీరు తీసుకుంటున్న తేనె నిజంగానే స్వచ్ఛమైందా.? నకిలీదా.? తెలుసుకోవడానికి కొన్ని సింపుల్‌ ట్రిక్స్‌తో తెలుసుకోవచ్చు. అవేంటంటే..

* తేనె నాణ్యతను తెలుసుకోవడానికి ముందుగా ఒక టేబుల్‌ స్పూన్‌ను తీసుకొని కొద్దిగా నీళ్లు, రెండు నుంచి మూడు చుక్కల వెనిగర్‌ కలిపి మిక్స్‌ చేయాలి. ఒకవేళ ఈ మిశ్రమంలో నురగ వస్తే అప్పుడు ఆ తేనె కల్తీ అని గుర్తించాలి.

* తేనెను పాన్‌పై వేసి వేడి చేయాలి. ఒకవేళ నురగ వస్తుంటే అది నకిలీ తేనె అని కాన్ఫామ్‌ చేసుకోవాలి.

* స్వచ్ఛమైన తేనె చాలా స్మూత్‌గా ఉంటుంది. తేనె పొరలుగా విడిపోదు. ఒకవేళ నకిలీ తేనె అయితే ఈ లక్షణాలు కనిపించవు.

* ఒక గ్లాసులో నీటిని తీసుకొని అందులో ఒక టీస్పూన్‌ తేనెను వేయాలి. ఒకవేళ తేనె త్వరగా కరిగిపోతే అది నకిలీదని గుర్తించాలి. స్వచ్ఛమైన తేనె గ్లాసులో వేస్తే నేరుగా అడుగు భాగంలోకి వెళ్లి ఆ తర్వాత నెమ్మదిగా కరుగుతుంది.

* ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దానిపై తేనె చుక్క వేయాలి. ఒకవేళ తేనె స్వచ్ఛమైంది అయితే ఆ వస్త్రం తేనెను లోపలికి పీల్చుకోదు. అలాగే మరకలు కూడా పడవు. నకిలీ అయితే సులభంగా మరకలు పడతాయి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad