LIC Children Gift Fund: ఏడేళ్లలో మీ పిల్లల పేరుతో రూ.11 లక్షలు రిటర్న్స్ పొందొచ్చు

 LIC Children Gift Fund: ఏడేళ్లలో మీ పిల్లల పేరుతో రూ.11 లక్షలు రిటర్న్స్ పొందొచ్చు ఇలా...


 
LIC Childrens Gift Fund | పిల్లల పేరు మీద డబ్బు పొదుపు చేయాలనుకునేవారి కోసం ఎల్ఐసీ నుంచి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ అందుబాటులో ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్‌తో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి

మీరు మీ పిల్లల పేరు మీద ప్రతీ నెలా కొంత పొదుపు చేయాలనుకుంటున్నారా? ఇన్స్యూరెన్స్ దిగ్గజం అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సంస్థకు చెందిన ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ (LIC Mutual Fund) ఆర్గనైజేషన్ ఓ మంచి అవకాశం ఇస్తోంది. ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ పలు రకాల ఫండ్స్ నిర్వహిస్తోంది. అందులో ఎల్ఐసీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ (LIC Childrens Gift Fund) కూడా ఒకటి. ఇది హైరిస్క్ మ్యూచువల్ ఫండ్. ఇందులో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్‌లో ప్రతీ నెలా కొంత మొత్తం పొదుపు చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందొచ్చు. లేదా మీ దగ్గర పెద్దమొత్తంలో డబ్బు ఉంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు.

గత ఐదేళ్లలో ఎల్ఐసీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ ఇన్వెస్టర్లకు 31.50 శాతం రిటర్న్స్‌ని ఇచ్చింది. గత మూడేళ్లలో 23.75 శాతం రిటర్న్స్ రాగా, గత రెండేళ్లలో 17.75 రిటర్న్స్ వచ్చాయి. ఎల్ఐసీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్‌లో గత ఏడాదిగా నెలకు రూ.10,000 చొప్పున సిప్ చేసి ఉంటే ఇప్పుడు రూ.1.21 లక్షల వ్యాల్యూ ఉండేది. గత మూడేళ్లలో నెలకు రూ.10,000 చొప్పున జమ చేసి ఉంటే రూ.4.41 లక్షల రిటర్న్స్ వచ్చేవి. గత ఐదేళ్లలో నెలకు రూ.10,000 చొప్పున జమ చేసి ఉంటే రూ.7.83 లక్షల రిటర్న్స్ వచ్చేవి

ఎల్ఐసీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్‌లో గత ఏడేళ్లలో ప్రతీ నెలా రూ.10,000 చొప్పున జమ చేసి ఉంటే ఇప్పుడు రూ.11.74 లక్షల సంపద ఉండేది. ఇప్పటి నుంచి పొదుపు మొదలుపెడితే రిటర్న్స్ ఇలాగే ఉన్నా దాదాపు ఇంతే మొత్తం రిటర్న్స్ వస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ స్టాక్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది.

ఎల్ఐసీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ 86.72 శాతం భారతీయ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. అందులో 65.12 శాతం లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో, 9.87 శాతం మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో, 4.55 శాతం స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. 11.54 శాతం డెట్ ఫండ్‌లో, 11.54 శాతం గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది.

ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ నుంచి పలు రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ పేర్లతో వేర్వేరు ఇన్వెస్టర్ల అవసరాలకు తగ్గట్టుగా మ్యూచువల్ ఫండ్స్ అందిస్తోంది. నెలకు రూ.500 ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో చేరొచ్చు. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ప్రతీ నెలా కొంత పొదుపు చేయొచ్చు.

CLICK HERE  FOR PLANS

ALSO READ: 

SBI కీల‌క నిర్ణ‌యం, బ్యాంక్ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌!!

మీ SBI అకౌంట్ BALANCE ఎంత? సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇలా

SBI ఖాతాదారులకు స్పెషల్ ఆఫర్

SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!

SBI: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే SBI అందించే ఈ ఆఫర్ మీ కోసమే.

SBI Car Loan: కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad