Petrol Price: టెన్షన్‌ పెడుతోన్న తాజా నివేదిక.. రూ.15-22 పెరగనున్న పెట్రో ధరలు..!ఎప్పటినుంచి అంటే

 Petrol Price: టెన్షన్‌ పెడుతోన్న తాజా నివేదిక.. రూ.15-22 పెరగనున్న పెట్రో ధరలు..!

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఇప్పుడు అన్ని దేశాలను టెన్షన్‌ పెడుతోంది.. యుద్ధం కంటే ముందుగానే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు క్రమంగా పైపైకి కదిలాయి.. దానికి యుద్ధం తోడు కావడంతో.. రికార్డు ధరలను తాకుతున్నాయి… అయితే, అంతర్జాతీయ పరిస్థితులకు తోడు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడుతోంది… ఇప్పటికే వంటనూనెల ధరలు, స్టీల్‌ వంటి ధరలు పెరుగుతాయనే విశ్లేషలు చెబుతుండగా.. ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు కూడా భారీగా పెరిగే అవ‌కాశం ఉందంటూ తాజాగా ఓ నివేదిక పేర్కొనడం.. సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. యుద్ధం కారణంగా అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు 125 డాల‌ర్లకు పెరిగే అవ‌కాశం ఉందని పేర్కొన్న ఆ నివేదిక, అదే జరిగితే భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీట‌ర్‌కు ఏకంగా రూ.15 నుంచి రూ.22 వరకు పెరుగుతాయని అంచనా వేసింది.

DSC Wise DA Arrears మీకు రావలసిన డీఏ అరియర్స్ ఎంతో తెలుసా (July 2018 to December 2020)

Jobs: Bank jobs - Central Jobs -  జాబ్ కోసం చూస్తున్నారా 

 ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారా.. అయితే మీ కోసమే

అయితే, క్రమంగా పెరుగుతూ భారత్‌లో రికార్డు స్థాయిని తాకాయి పెట్రో ధరలు.. కానీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు వాటిపై పన్నులు తగ్గిస్తున్నట్టు ప్రకటించి ఉపశమనం కలిగించిన కేంద్ర ప్రభుత్వం.. ఇక, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలు జోలికి మాత్రం పోవడం లేదు.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు క్రమంగా పైకి కదులుతున్నా.. వాటి ధరలను సవరించే ధైర్యం మాత్రం చేయలేదు.. కానీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన ముగియనున్నాయి.. 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.. అయితే, పోలింగ్‌ ముగిసిన రోజే లేదా ఆ తర్వాత రోజే పెట్రో బాంబ్‌ పేలడం ఖాయమని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. పెట్రో ఉత్పత్తులకు అవ‌స‌ర‌మైన క్రూడాయిల్‌లో 85 శాతం దిగుమ‌తుల ద్వారానే సమకూర్చుకుంటుంది భారత్.. దీంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధ‌ర పెంపు భార‌త ఆర్థిక‌వ్యవ‌స్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఇటీవల, సంక్షోభం మరియు తక్కువ సరఫరాల భయాలు బ్రెంట్ ముడి చమురు ధరను 10 సంవత్సరాల గరిష్ట స్థాయికి దాదాపు బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరాయి.. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతాయని.. భారత్‌లో పెట్రో మంట మండబోతోంది అంటూ వెలువడిని తాజా రిపోర్టులు ఇప్పుడు సామాన్యులకు గుబులుపుట్టిస్తున్నాయి.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad