Teachers ను బెదిరిద్దామనుకుంటే...

 Teachers ను బెదిరిద్దామనుకుంటే  APలో ఇలా సీన్ రివర్స్ అయ్యిందేంటి..!?

విద్యాశాఖ తలకు చుట్టుకున్న టోల్‌ ఫ్రీ నెంబర్‌

బడుల విలీనంపై ఫిర్యాదుల వెల్లువ

 ప్రభుత్వ ఉద్యోగులు సర్దుకుపోయినా, సంతృప్తి చెందకుండా నిరనసలు తెలుపుతున్న టీచర్లను ప్రభుత్వం ఇరుకున పెట్టడానికి ఉద్దేశించినట్లు భావిస్తున్న టోల్‌ఫ్రీ నెంబరు ఇప్పుడు బూమరాంగ్‌ అయ్యింది. జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం)లో నాణ్యత, అమలు తీరు, పాఠశా మరుగుదొడ్ల నిర్వహణ తీరు, లోటుపాట్లు, జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ తీరు, దానిలో ఎదురవుతున్న సమస్యలు, పాఠశాల మౌలిక సౌకర్యా లకు సంబంధించిన సమస్యలు, పాఠశాల విద్యాబోధన- వాటి సమస్యలు వంటి ఐదు రకాల అంశాలను పేర్కొంటూ, ఇందులో ఏ సమస్య ఎదురైనా 14417 అనే టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ విస్తృతంగా ప్రచారం చేసింది. పేరుకు ఐదు అంశాలున్నా, ఐదో అంశమైన ‘పాఠశాల విద్యాబోధనకు సంబంధించిన అంశాలు’ అనే దానిపైనే ప్రభుత్వం గురిపెట్టిందని ఉపాధ్యాయులు అనుమానించారు. 

బోధనా సంబంధ అంశాలు అంటే, తమ పనితీరేనని, అంటే పరోక్షంగా పనితీరుపై నిఘా పెట్టి, జనాలను తమపైకి ఉసిగొల్పడానికే ప్రత్యేకించి టోల్‌ ఫ్రీ నెంబర్‌ను రూపొందించారని, ఇది ఏ రకంగా తమ నెత్తికి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. రివర్స్‌ పీఆర్సీ ఉద్యమ నేపథ్యంలో తమపై గుర్రుగా ఉన్న పాలకులు, ఈ రూపంలో కక్ష తీర్చుకోవడానికి చూస్తున్నారని భావిస్తున్నారు. అయితే వారు ఊహించినట్టు కాకుండా ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ పథకం ప్రభుత్వానికే రివర్స్‌ అయ్యిందంటున్నారు. ప్రస్తుతం పాఠశాలల విలీనం పేరుతో 3, 4, 5 తరగతులను  మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో కలిపేస్తున్నారు. ఇందువల్ల తమ గ్రామంలోనే ఉన్న పాఠశాలను వొదులుకుని మూడు కిలోమీటర్ల దూరం తమ చిన్నారులను పంపించాల్సి రావడంపట్ల అసంతృప్తితో ఉన్న తల్లిదండ్రులు, ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు వెల్లువలా ఫిర్యాదులు పంపుతున్నారని తెలిసింది. దీంతో తలపట్టుకోవడం అధికారుల వంతైంది.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad