ఆ పాఠశాలలో చదువుకున్న 100 మంది పూర్వ విద్యార్థులకు ఒకే రకమైన క్యాన్సర్..

ఆ పాఠశాలలో చదువుకున్న 100 మంది పూర్వ విద్యార్థులకు ఒకే రకమైన క్యాన్సర్..


అది ఓ హైస్కూల్.. అందులో చదువుకున్న స్టూడెంట్స్, పనిచేసిన సిబ్బంది ప్రజెంట్ వేర్వేరు చోట్ల స్తిరపడ్డారు.. కానీ ఇప్పుడు అక్కడ చదువుకున్న విద్యార్థులు క్రమంగా.. క్యాన్సర్ భారిన పడుతున్నారు. అలా ఇప్పటికి 100 పూర్వ విద్యార్థులు, టీచర్స్ క్యాన్సర్ కు గురయ్యారు. ఇదేదో సస్పెన్స్ మూవీ టైప్ లో ఉంది కదా.. క్యాన్సర్ భారిన పడిన వారందరిలో కామన్ పాయింట్.. ఆ పాఠశాలలో చదవడమే..ఓ పూర్వ విద్యార్థి తనకు అసలు క్యాన్సర్ ఏ విధంగా సోకింది అనే చేసిన రీసర్చ్ లో ఈ విషయం బయటపడింది. ఇంతకీ ఏమై ఉంటుంది..?

అమెరికాలోని న్యూజెర్సీలో బయటపడ్డ ఈ మిస్టరీ ఉదంతంపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. న్యూజెర్సీ వూడ్‌బ్రిడ్జ్‌లోని కలోనియా హైస్కూల్‌లో చదువుకున్న ఆల్‌ లుపియానోకు 20 ఏళ్ల క్రిందటే మెదడులో అరుదైన క్యాన్సర్‌ కణతిని గుర్తించారు. లుపియానోతో పాటు ఆయన సోదరి, భార్యలోనూ అటువంటి (Glioblastoma) ట్యూమర్‌ బయటపడింది.. ఈ వ్యాధి నుంచి లుపియానో కోలుకున్నప్పటికీ.. దురదృష్టవశాత్తూ ఆయన సోదరి, భార్య ఇటీవలే కన్నుమూశారు. ఇలా ఒకే కుటుంబంలోని వారికి ఒకేవిధమైన క్యాన్సర్‌ సోకడం పట్ల అనుమానం వ్యక్తం చేసిన లుపియానో.. కారణాలను అన్వేషించారు..

రేడియోధార్మికతపై అనుమానాలు..

క్యాన్సర్‌ కారణాలను వెతకడం మొదలుపెట్టిన లుపియానో అందులో భాగంగానే.. తాను చదువుకున్న కలోనియా హైస్కూల్‌ పూర్వ విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు.. 1975 నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో అదే పాఠశాలలో చదువుకున్న 102 మంది ఇదేరకమైన బ్రెయిన్‌ క్యాన్సర్‌ బారినపడినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి లుపియానో షాక్ అయ్యారు.. దీంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇది కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ అసాధారణ ఉదంతానికి గల కారణాలను అన్వేషించడంలో భాగంగా పాఠశాల గదుల్లోని రేడియోధార్మికతపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో అక్కడ గదుల్లోని ర్యాండన్ (Rn) మూలకంతోపాటు ఇతర నమూనాలను అధికారులు సేకరించారు..

ఒకే పాఠశాలకు చెందిన 100 మంది క్యాన్సర్‌ బారినపడిన విషయం దేశమంతా తెలియడంతో.. ఆ పాఠశాల ఉన్న స్థానికుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ విషయంపై స్పందించిన వూడ్‌బ్రిడ్జ్‌ మేయర్‌ జాన్‌ మెక్‌కార్మాక్‌.. ‘దీనిపై స్థానికులందరిలో ఆందోళన నెలకొంది. ఇది కచ్చితంగా అసాధారణమైన విషయమే. ఇందుకుగల కారణాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు’ అని తెలిపారు.. ఇంకోపక్క.. ఇంత మందికి ఒకటే క్యాన్సర్.. అది ఒకే పాఠశాలకు చెందిన వారికి రావడానకి గల కారణాలు తెలుసుకునే తీరతానని.. 50 ఏల్ల లుపియానో అంటున్నారు.

గ్లియోబ్లాస్టోమా అనేది చాలా అరుదైన క్యాన్సర్‌. ప్రతి లక్ష మందిలో ఇది కేవలం 3.2 మందిలోనే బయటపడే అవకాశం ఉంటుందని… అమెరికన్‌ అసోసియేషన్‌ సర్జన్స్‌ గణాంకాలు చెబుతున్నాయి. కలోనియా హైస్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థుల్లో వెలుగు చూసిన క్యాన్సర్‌ ఈ రకానికి చెందినదే.. ఇంతకీ వాళ్లందరికి ఒకటే క్యాన్సర్ రావడానికి ఆ స్కూల్ కు కారణాలు ఏమై ఉండొచ్చు.. నెటిజన్ల నుంచి వివిధ రకాల స్పందనలు వస్తున్నాయి. అప్పుడు ఏం చేసి ఉంటారు, ఇప్పుడు ఇదే హైలెట్ టాపిక్ గా మారింది.

-Triveni Buskarowthu

ఇవి కూడా చ‌ద‌వండి

SBI Youth for India Fellowship 2022: నెలకు రూ.16,000 స్టైపెండ్‌.. రూ.50,000 అలవెన్స్‌

సుకన్య సమృద్ధి యోజన, NPS, PPF ఖాతాదారులు అలర్ట్‌.

SBI Jobs 2022: Upcoming SBI CLERKS , PO పోస్టులకు నోటిఫికేషన్‌

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad