AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి.. GAZETTE NOTFICATION RELEASED

 AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి.. చిన్నచిన్న మార్పులకు ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్‌


AP New Districts: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రభుత్వం మరో ముందడగుపడింది. కొత్త జిల్లాలకు సంబంధించి కసర్తతు పూర్తైంది. కొత్త జిల్లాల అవతరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కార్యాలయాలు సిద్ధమయ్యాయి. వాస్తవానికి ఇవాళ్టి నుంచే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. కానీ, పలు కారణాలతో నాలుగో తేదీ నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయని ప్రకటించింది. శనివారం వర్చువల్‌గా భేటీ అయిన రాష్ట్ర కేబినెట్‌(AP Cabinet).. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయబోతోంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ ఎప్పుడైనా రావచ్చని తెలుస్తోంది.

DOWNLOAD GAZETTE NOTIFICATION SINGLE FILE

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. కొత్త జిల్లాలకు ఆమోద ముద్ర వేసింది ఏపీ కేబినెట్. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 26 జిల్లాలు ఉనికిలోకి రానున్నాయి. అటు జిల్లాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ కూడా సిద్ధమైంది. మొత్తం 26 జిల్లాలకు ఆమోదం తెలిపింది కేబినెట్. 26 జిల్లాల్లో 73 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తోంది జగన్ ప్రభుత్వం. తాజాగా కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో కొన్ని మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి. మార్పులను వర్చువల్‌గా ఆమోదించింది కేబినెట్. కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ తర్వాత ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. అధికారులు, ఉద్యోగుల కేటాయింపుపై జీవోలు ఇవ్వనున్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.

ALSO READ: AP NEW DISTRICTS : కొత్త జిల్లాల తాజా స్వరూపం

కొత్త మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ జిల్లా, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అటు కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేయనుంది ఏపీ సర్కార్. పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తి, కుప్పంలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనుంది జగన్ ప్రభుత్వం.

కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం అని చెప్పారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని, కొత్త జిల్లాలకు సంబంధించి కసర్తతు పూర్తైందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు జరిగిందని సజ్జల స్పష్టం చేశారు. 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్‌ గెజిట్‌ సిద్దమైంది. అటు పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుంచి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.

కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..

1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ

4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,

7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

14. గుంటూరు : గుంటూరు, తెనాలి

15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల

21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.

కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య..

శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు 

విజయనగరం జిల్లా.. 27 మండలాలు 

పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు 

అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు 

విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు 

అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు 

కాకినాడ జిల్లా.. 21 మండలాలు 

కోనసీమ జిల్లా.. 22 మండలాలు 

తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు 

పశ్చిమగోదావరి జిల్లా.. 19 మండలాలు 

ఏలూరు జిల్లా.. 28 మండలాలు 

కృష్ణా జిల్లా.. 25 మండలాలు 

ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు 

గుంటూరు జిల్లా.. 18 మండలాలు 

బాపట్ల జిల్లా.. 25 మండలాలు 

పల్నాడు జిల్లా.. 28 మండలాలు 

ప్రకాశం జిల్లా.. 38 మండలాలు 

నెల్లూరు జిల్లా.. 38 మండలాలు 

కర్నూలు జిల్లా.. 26 మండలాలు 

నంద్యాల జిల్లా.. 29 మండలాలు 

అనంతపురం జిల్లా.. 31 మండలాలు 

శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు 

వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు 

అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు 

చిత్తూరు జిల్లా.. 31 మండలాలు 

తిరుపతి జిల్లా.. 34 మండలాలు

DOWNLOAD GAZETTE NOTIFICATION SINGLE FILE

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad