Biscuits Holes: కొన్ని రకాల బిస్కెట్లకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి..?

 కొన్ని రకాల బిస్కెట్లకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి..? అలకంరణ కోసం అయితే కాదు..

బిస్కెట్స్ అంటే ఇష్టమేనా.. అయితే మీ ఫేవరెట్ బిస్కెట్ ఏదీ అంటే.. మనసులో వెంటనే ఆ బిస్కెట్ గుర్తుకు వచ్చేస్తుంది కదా.. చాలామందికి క్రీమ్ బిస్కెట్స్ అంటే ఇష్టం ఉంటుంది. మధ్యలో చాక్లెట్ క్రీమ్.. పైన అలా అలా పంచదార పొలుకులు చల్లి ఉంటాయి.. మార్కెట్ లో చాలా రకాల బిస్కెట్లు ఉంటాయి. ప్రతిదాని ప్యాకింగ్ వేరు.. బిస్కెట్స్ రంగూ, రూపం, రుచి వేరు. అయితే కొన్ని బిస్కెట్లకు రంధ్రాలు ఉంటాయి. ఉదాహరణకు.. మారీగోల్డ్, 50-50, ఇలా.. ఇంకా చాలానే ఉన్నాయి. అసలు మీకెప్పుడైనా ఆ రంధ్రాలు ఎందుకు ఉంటాయి అనే డౌట్ వచ్చిందా..? ఏదో షోయింగ్ కోసం పెట్టారనుకుంటే పొరపాటే..!

ఈ క్రాకర్స్‌లోని చిన్న రంధ్రాలను “డాకర్స్(Doctors)” అని కూడా పిలుస్తారు. ఇవి బేకింగ్ ప్రక్రియలో ఆవిరి క్రాకర్స్‌ గుండా ప్రయాణించేందుకు ఉపయోగపడతాయి. దీని ద్వారా క్రాకర్స్‌ ఇతర బిస్కెట్లు(Biscuits) లేదా బ్రెడ్‌ల వలె పైకి ఉబ్బకుండా ఉంటాయి. బుడగలు వంటివి ఏర్పడకుండా ఈ రంధ్రాలు ఆపుతాయి. ఆ రంధ్రాలు అలంకరణ కోసం కాదు.. వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయండోయ్..

క్రాకర్స్‌లో హోల్స్‌ ఎందుకు?

రంధ్రం లేకుండా క్రాకర్స్‌ సరిగా కాలవు. క్రాకర్స్‌ తయారీకి ముందు సిద్ధం చేసిన మిశ్రమంలో సాధారణంగా చాలా గాలి బుడగలు ఉంటాయి. క్రాకర్స్‌ను మైక్రోవేవ్‌ అవెన్‌లో వేడి చేసినప్పుడు అవి విస్తరిస్తాయి. డాకర్ అనే యంత్రంతో రోల్స్‌పై ఉంచిన పిండి మిశ్రమంపై రంధ్రాలు చేస్తారు. అప్పుడే క్రాకర్స్‌ సక్రమంగా కాలుతాయి. గాలి బుడగలను తగ్గించడంతో పాటు, క్రాకర్స్‌ క్రిస్పీగా ఉండేలా రంధ్రాలు ఉపయోగపడుతాయి.అందుకే రంధ్రాలు ఉండే బిస్కెట్స్ భలే క్రిస్పీగా ఉంటాయి.


ఇంట్లో కూడా కొందరు బిస్కెట్స్ తయారుచేస్తుంటారు. అయితే వీటిని జాగ్రత్తగా భద్రపరచకపోతే.. వెంటనే మెత్తబడిపోతాయి. క్రాకర్స్‌ను గాలి చొరబడని బ్యాగ్‌లో లేదా గాజు లేదా ప్లాస్టిక్ బాక్స్‌లలో నిల్వ చేస్తే మంచిది. చీకటి క్యాబినెట్‌లో ఆ పాత్రలను ఉంచాలి. ఇంకా మనం బయట నుంచి తెచ్చిన బిస్కెట్స్ ఒక్కోసారి కొద్దిగా మెత్తగా అయిపోతుంటాయి. వాటిని ఫ్రిడ్జ్ లో పెడితే అవి గట్టిగా అవుతాయండి. అదేంటి కూలింగ్ కి ఇంకా మెత్తగా అవుతాయి కదా అనుకుంటారేమో. కాదు.. గట్టిగానే అవుతాయి. కావలంటే.. ఓ సారి ట్రై  చేయండి

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad