రుయా ఆసుపత్రి: అంబులెన్స్ మాఫియాకు అడ్డుకట్ట.. ఆరుగురు అరెస్ట్

 అంబులెన్స్ మాఫియాకు అడ్డుకట్ట.. ఆరుగురు అరెస్ట్

తిరుపతి రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియాకు అడ్డుకట్టపడింది. అంబులెన్స్ ధరలను నిర్దేశిస్తూ స్విమ్స్, రుయా ఆసుపత్రి వద్ద బోర్డులను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట రమణరెడ్డి అన్నారు. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్న ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. 

రుయా హాస్పిటల్‌ అంబులెన్స్ డ్రైవర్లందరూ మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేల్చారు. అంబులెన్స్ ధరలను నిర్దేశిస్తూ స్విమ్స్, రుయా ఆసుపత్రి వద్ద బోర్డులను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట రమణరెడ్డి అన్నారు. 

నిర్దేశిత ధరల కన్నా, ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పిడియాక్ట్ కేసులు పెడతామన్నారు.

తిరుప‌తి రుయా ఆసుపత్రి ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసులిచ్చామన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad