BOMB ALERT TO SCHOLS: పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిక.. కలకలం రేపిన ఘటన

 పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిక.. కలకలం రేపిన ఘటన


కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru) లో కలకలం రేగింది. నగరంలోని పలు పాఠశాలల్లో బాంబులు(Bomb) పెట్టినట్లు ఒకేసారి బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ఏడు పాఠశాలలకు ఒకేసారి బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. బాంబు పెట్టినట్లు బెదిరింపులు వచ్చిన పాఠశాలలకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం(ఇవాళ) ఉదయం 11 గంటల ప్రాంతంలో బెంగళూరులోని ఏడు ప్రముఖ పాఠశాలలకు వేర్వేరు ఈ-మెయిల్‌ ఐడీల నుంచి ఓ మెయిల్‌ వచ్చింది. మీ స్కూల్‌లో శక్తిమంతమైన బాంబు పెట్టామని, దీనిని జోక్ గా భావించకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉంది’’ అని రాసి ఉంది. మెయిల్ వచ్చిన సమయంలో ఆయా పాఠశాలల్లో ఎగ్జామ్స్(Exams) జరుగతున్నాయి. 

బాంబు బెదిరింపు మెయిళ్లతో స్కూల్‌ యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. వారి సమాచారంతో పోలీసులు పాఠశాలలకు చేరుకుని బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టాయి. విద్యార్థులను బయటకు పంపించి కార్డన్‌సెర్చ్‌ చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని బెంగళూరు కమిషనర్‌ కమల్‌ పంత్‌ తెలిపారు. బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad