Corona: కోవిడ్‌ ఎఫెక్ట్‌.. కరోనా జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం.. పరిశోధనలలో కీలక అంశాలు

Corona: కోవిడ్‌ ఎఫెక్ట్‌.. కరోనా జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం.. పరిశోధనలలో కీలక అంశాలు.. ఇలా చేయాలంటున్న నిపుణులు..!

Corona: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి అదుపులోకి రాగా, ప్రస్తుతం కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. థర్డ్‌వేవ్‌ ముగియగా, జూన్‌లో ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఈ నేపథ్యంలో కేసులు క్రమ క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం, ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. ఇక కరోనా ఇన్ఫెక్షన్ (కోవిడ్-19) మన శరీరంపై అనేక విధాలుగా ప్రభావం చూపిస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులకు ఇది ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ లాగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని బలి తీసుకున్న ఈ వైరస్ నేటికీ ఇంకా వణికిస్తోంది. కరోనాతో బాధపడుతున్న వ్యక్తులు చాలా కాలంగా కీళ్ల నొప్పులు, శ్వాస ఇబ్బందులు, ఇతర అనేక శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కరోనా నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

పరిశోధన ప్రకారం.. సంక్రమణ పెరిగితే అప్పుడు న్యుమోనియా సంభవిస్తుంది. అటువంటి రోగులలో చిత్తవైకల్యం ప్రమాదం పెరుగుతుంది. డిమెన్షియా ప్రాథమికంగా డిప్రెషన్‌కు సంబంధించినది. అదే సమయంలో జ్ఞాపకశక్తిపై దాని ప్రభావం గురించి కూడా పరిశోధనలు జరిగాయి. దానితో బాధపడుతున్న రోగుల మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఆందోళన, జ్ఞాపకశక్తి కోల్పోవడం (Memory), స్ట్రోక్ సమస్యలు వారిని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. అయితే వీటి నుంచి రక్షించుకునేందుకు కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పాటించడం ద్వారా మీరు జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.

యోగా చేయండి:

మీరు కరోనా ఇన్‌ఫెక్షన్‌లో ఉన్నా లేకున్నా రోజూ యోగా చేయాలి. ప్రపంచవ్యాప్తంగా యోగా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యోగా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం చురుకుగా ఉంటుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది. దాని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. రోజూ 15 నిమిషాల పాటు బలాసన్, కపాలభాతి తదితర యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా ఇవి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నానబెట్టిన బాదం:

మెదడు ఆరోగ్యాన్ని పెంచేందుకు బాదంపప్పు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. జ్ఞాపకశక్తిని బలంగా ఉంచుకోవడానికి నానబెట్టిన బాదంపప్పులను రోజూ తినాలని వైద్యులు, నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు. మెదడుకు పదును పెట్టాలంటే బాదంపప్పు తినాలని ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. బాదంలో ఇటువంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.

తులసి:

తులసి మూలికలలో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఆయుర్వేదంలో తులసి ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీబయాటిక్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచడానికి కూడా పనిచేస్తుంది. దీని కోసం మీరు 5 నుండి 10 తులసి ఆకులు, 5 బాదం, తేనె కలిపి తినవచ్చు. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad