Sabja Seeds: సబ్జా గింజలతో ఈ సమస్యలన్నీ మటుమాయం.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.

Sabja Seeds: సబ్జా గింజలతో ఈ సమస్యలన్నీ మటుమాయం.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..


Sabja Seeds in Summer: ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఎండాకాలంలో సబ్జాగింజల నీరు తాగితే శరీరం కూల్ అవుతుందని పేర్కొంటున్నారు. సబ్జా విత్తనాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం నుంచి చర్మాన్ని మెరిసేలా చేయడం వరకు ఎన్నో సమస్యలను సబ్జా గింజలతో చెక్ పెట్టవచ్చు. వీటిని అనేక ఆయుర్వేద ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. మల్టీవిటమిన్‌లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. సబ్జా విత్తనాలు టైప్ 2 డయాబెటిస్, కొలెస్ట్రాల్, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి కూడా సహాయపడతాయి . మీరు దీన్ని ఎలా తినవచ్చు, ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సబ్జా విత్తనాలు ఎలా తీసుకోవాలి?

1 లేదా 2 చెంచాల సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రి నానబెట్టండి. మరుసటి రోజు పరగడుపున తీసుకోవాలని. ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి విత్తనాలను నములుతూ.. ఈ నీటిని తాగడం మంచిది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: సబ్జా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది తక్కువ మొత్తంలో కేలరీలను కలిగి ఉంటుంది. ఇందులో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడానికి పనిచేస్తుంది. జీవక్రియను వేగవంతం చేసి ఉదర సమస్యలకు చెక్ పెడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.


ఉదరం సమస్యలను నయం చేస్తుంది: ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ విత్తనాలు శరీరాన్ని సహజంగా డిటాక్స్ చేయడానికి పని చేస్తాయి. ఇవి ఎసిడిటీ, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేసి పొట్టను శుభ్రంగా ఉంచుతాయి.

చర్మం – జుట్టు: సబ్జా గింజలు మీ జుట్టు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఈ గింజల్లో ప్రొటీన్లు, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు జుట్టు ఒత్తుగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. చర్మం మెరిసేలా చేసేందుకు కొబ్బరి నూనెలో ఒక టీస్పూన్ తులసి గింజలను కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత జల్లెడ పట్టి చర్మంపై అప్లై చేయాలి. ఇది సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.

రక్తంలో చక్కెరను నియంత్రించడానికి: సబ్జా గింజలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. అందువల్ల, మీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలనుకుంటే మీరు సబ్జా విత్తనాలను తినడం, నీరు తాగడం మంచిది.

ALSO READ: 

ఉదయాన్నే ఈ నీరు తాగితే Sugar అదుపులో.. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు..!

నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే.. ఈ లక్షణాలు ఉంటె జాగర్త

ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..

గుమ్మడికాయ గింజలు కనిపిస్తే అస్సలు వదలద్దు..! నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

(ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం నిపుణుల సూచనల మేరకే.. మేము  వీటిని ధృవీకరించడంలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత దీన్ని అనుసరించడం మంచిది.)

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad