SBI: ఎస్‌బీఐ నుంచి అద్భుతమైన ఛాన్స్... రూ.9,00,000 ప్రైజ్ మనీ


SBI: ఎస్‌బీఐ నుంచి అద్భుతమైన ఛాన్స్... రూ.9,00,000 ప్రైజ్ మనీ

ఇన్నోవేట్ ఫర్ బ్యాంక్ 2022 హ్యాకథాన్ (Innovate for Bank Hackathon) ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). మైక్రోసాఫ్ట్అజ్యూర్‌తో కలిసి ఈ హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఎస్‌బీఐ ఎదుర్కొంటున్న సవాళ్లకు సాంకేతికంగా పరిష్కారం చూపించి ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. ఈ హ్యాకథాన్‌కు మొత్తం రూ.9,00,000 ప్రైజ్ మనీ ప్రకటించింది ఎస్‌బీఐ. ఈ హ్యాకథాన్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2022 మే 20 వరకు రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఐడియా సబ్మిషన్, ప్రోటోటైప్, విజేతల ప్రకటన లాంటి పలు దశలు ఉంటాయి. 2022 జూన్ 29న విజేతలను ప్రకటిస్తుంది ఎస్‌బీఐ. మొత్తం 5 థీమ్స్‌లో ఈ హ్యాకథాన్ జరుగుతోంది. ఇమేజ్, డాక్యుమెంట్ ఆప్టిమైజేషన్, వీడియో కంప్రెషన్, వాయిస్ బయోమెట్రిక్స్, ఐడెంటిఫికేషన్ అండ్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, వీడియో అనలిటిక్స్ అంశాల్లో ఐడియాలను ఆహ్వానిస్తోంది ఎస్‌బీఐ.

SBI Innovate for Bank Hackathon: ఎస్‌బీఐ ఇన్నోవేట్ ఫర్ బ్యాంక్ 2022 హ్యాకథాన్ వివరాలివే

రౌండ్ 1 రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2022 ఏప్రిల్ 22

రౌండ్ 1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ- 2022 మే 20

రౌండ్ 2 ఐడియా సబ్మిషన్ ప్రారంభం- 2022 ఏప్రిల్ 22

రౌండ్ 2 ఐడియా సబ్మిషన్‌కు చివరి తేదీ- 2022 మే 24

ఐడియాల పరిశీలన- 2022 మే 25 నుంచి మే 31 వరకు

ప్రోటోటైప్ క్వాలిఫయర్ల ప్రకటన- 2022 జూన్ 1

రౌండ్ 3 ప్రోటోటైప్ డెవలప్‌మెంట్- 2022 జూన్ 1 నుంచి 2022 జూన్ 20 వరకు

ప్రోటోటైప్ పరిశీలన- 2022 జూన్ 21 నుంచి జూన్ 28 వరకు

విజేతల ప్రకటన- 2022 జూన్ 29

ఇది టీమ్ పార్టిసిపేషన్ హ్యాకథాన్. టీమ్‌లో నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ సభ్యులు ఉండాలి. ఇది ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న హ్యాకథాన్. ఈ హ్యాకథాన్‌లో పాల్గొనేవారు భారతదేశంలో నివసిస్తున్నవారై ఉండాలి. ఒకరు ఎన్ని హ్యాక్స్ అయినా సబ్మిట్ చేయొచ్చు. అయితే తుది గడువు కన్నా ముందు వచ్చిన హ్యాక్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ఐడియా దశకు ఎంపికైనవారు మాత్రమే హ్యాకథాన్‌లో కొనసాగుతారు. వారు మాత్రమే ప్రోటోటైప్ రూపొందించాల్సి ఉంటుంది.

హ్యాకథాన్‌లో పాల్గొనేవారు వినూత్నమైన ఐడియాలను సమర్పించాలి. మరోచోట ఐడియాలు కాపీ చేసినట్టైతే డిస్‌క్వాలిఫై చేస్తారు. హ్యాకథాన్ కోసం మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉపయోగించుకోవచ్చు. విజువల్ స్టూడియో, పవర్ యాప్స్, గిట్‌హబ్ లాంటి మైక్రోసాఫ్ట్ టూల్స్ కూడా ఉపయోగించవచ్చు. మైక్రోసాఫ్ట్ ప్రత్యర్థుల ప్రొడక్ట్స్ ఉపయోగించకూడదు. ఎస్‌బీఐ ఉద్యోగులు కూడా ఈ హ్యాకథాన్‌లో పాల్గొనొచ్చు. ఫస్ట్ ప్రైజ్ రూ.5,00,000, సెకండ్ ప్రైజ్ రూ.3,00,000, థర్డ్ ప్రైజ్ ప్రైజ్ రూ.1,00,000 ఇస్తుంది ఎస్‌బీఐ. ఈ హ్యాకథాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.techgig.com/digital/sbi-microsoft లింక్‌లో తెలుసుకోవచ్చు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad