SBI Alert: ఆ రెండు ఫోన్ నంబర్లు చాలా డేంజర్.. కస్టమర్లకు ఎస్‌బీఐ వార్నింగ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ముఖ్యమైన సూచన చేసింది. ఫిషింగ్ స్కామ్‌లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపిక చేసిన నంబర్‌ల నుండి వచ్చే కాల్‌లకు స్పందించవద్దని కోట్లాది మంది బ్యాంకింగ్ కస్టమర్‌లను కోరిందికేవైసీల కోసం ఫిషింగ్ లింక్‌లపై క్లిక్ చేయవద్దని తన కస్టమర్‌లను కోరింది. ఈ రకమైన ఫ్రాడ్ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో, SBI తన కస్టమర్ల కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడానికి తన ప్రయత్నాలను కూడా వేగవంతం చేస్తోంది
పలు నంబర్లతో ఎంగేజ్ చేయవద్దని.. కేవైసీ అప్‌డేట్‌ల కోసం ఫిషింగ్ లింక్‌లను క్లిక్ చేయవద్దు ట్వీట్ ద్వారా సూచించింది. వీటితో SBIకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఫిషింగ్ మోసాలకు పాల్పడే రెండు ఫోన్ నంబర్‌లను బ్యాంక్ వెల్లడించింది
బ్యాంకు ఖాతాదారులు ఈ మొబైల్ నంబర్‌ల నుంచి కాల్‌లు స్వీకరిస్తున్నారని తెలిపింది. SBI కస్టమర్లకు 91-8294710946, 91-7362951973 నంబర్ల నుంచి కేవైసీ అప్‌డేట్స్ కోసం ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయమని వారిని అడుగుతున్నారని.. అటువంటి అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయవద్దని SBI తమ కస్టమర్లందరినీ అభ్యర్థించింది. గత కొన్ని నెలల్లో ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య పెరిగింది
RBI నివేదిక ప్రకారం.. భారతదేశంలోని బ్యాంకులు ఏప్రిల్, సెప్టెంబర్ 2021 మధ్య మొత్తం 4,071 ఫ్రాడ్ కేసులు జరిగినట్టు వెల్లడించాయి. అమాయక కస్టమర్ల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టేందుకు మోసగాళ్లు సరికొత్త విధానాలను అమలు చేస్తుండటంతో.. వారిని అరికట్టడం బ్యాంకులను, సైబర్ నిపుణులకు సవాల్‌గా మారుతోంది.
ALSO READ:
ఏడేళ్లలో మీ పిల్లల పేరుతో రూ.11 లక్షలు రిటర్న్స్ పొందొచ్చు
SBI లోన్ తీసుకున్న వారికి బ్రేకింగ్ న్యూస్.. మీ EMIలు పెరగనున్నాయ్.
మీ ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింక్ చేశారో సులభంగా తెలుసుకోవచ్చు..!