Summer Health Care: వామ్మో.. కాకరేపుతున్న ఎండలు.. కూల్‌గా ఉండాలంటే వీటిని తీసుకోండి.

Summer Health Care: వామ్మో.. కాకరేపుతున్న ఎండలు.. కూల్‌గా ఉండాలంటే వీటిని తీసుకోండి.

Summer Fruits and Drinks: వేసవికాలం మొదలైంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎండాకాలంలో బయటకు వెళ్లినప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే వడదెబ్బకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీంతో శరీరం పూర్తిగా బలహీన పడుతుంది. అటువంటి పరిస్థితిలో శరీరాన్ని చల్లగా, హైడ్రేట్‌గా ఉంచడానికి మీరు నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కావున వేసవిలో వడ దెబ్బకు గురికాకుండా ఉండాలంటే కొన్ని పండ్లను, వాటి జ్యూస్ లను, పానీయాలను తీసుకుంటే మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


పుచ్చకాయ: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి, డీహైడ్రేషన్ సమస్యను అధిగమించడానికి పుచ్చకాయను తినడం మంచిది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే ఆకలి వేయదు. పుచ్చకాయలో లైకోపీన్ కూడా ఉంటుంది. ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

కీరదోస: వేసవిలో కీర దోసకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులోని నీరు శరీరాన్ని చల్లబరుస్తాయి. అంతే కాదు శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేయడంతో పాటు, శరీరంలోని pHని స్థాయిలను సరిగా నిర్వహించేలా చేస్తుంది. దీని వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలను దూరం అవుతాయి.

నిమ్మకాయ రసం: వేసవి కాలంలో నిమ్మరసం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సీజన్‌లో నిమ్మరసం తీసుకోవడం వల్ల వేడి, వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. దీంతోపాటు వేసవిలో తాజా అనుభూతి కలుగుతుంది.


కొబ్బరి నీరు:
కొబ్బరి నీటితో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. వేసవిలో రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి కొరతను అధిగమించవచ్చు. అంతే కాకుండా కొబ్బరి నీళ్లను తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

లస్సీ-మజ్జిగ: శరీరంలోని వేడిని తగ్గించడానికి, శరీరాన్ని చల్లబరచడానికి మీరు రోజూ మీ ఆహారంలో ఒక గిన్నె పెరుగు, రైతా (మజ్జిగ) లేదా లస్సీని చేర్చుకోవడం మంచిది.


సత్తు: వేసవిలో సత్తును తీసుకోవడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది. దీంతో ఎసిడిటీ సమస్య కూడా దూరమవుతుంది. ప‌ప్పుతో చేసిన స‌త్తులో ర‌క్తహీనతను దూరం చేసే పోషకాలు చాలా ఉన్నాయి. దీనిలో ఐర‌న్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తహీనత నుంచి బయటపడొచ్చు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad