CIBIL Score: CIBIL స్కోరు ఎంతుంటే LOANS సులభంగా లభిస్తాయి?

CIBIL Score: CIBIL  స్కోరు ఎంతుంటే LOANS  సులభంగా లభిస్తాయి?

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్.. క్రెడిట్ స్కోరును మూడు అంకెల సంఖ్యలో జారీ చేస్తుంది. సాధారణంగా సిబిల్ స్కోరు 300 నుంచి 900 వరకు ఉంటుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోరు ఉన్న వ్యక్తులను బాధ్యతాయుతమైన రుణగ్రహీతలుగా పరిగణిస్తారు. సిబిల్ స్కోరు విభిన్న శ్రేణులు, వాటి సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

750-900..

ఇది అద్భుతమైన శ్రేణి. సిబిల్ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటే..ఆ వ్యక్తి క్రెడిట్ చెల్లింపులు క్రమం తప్పకుండా ఉన్నాయని అర్థం. ఇది ఆకట్టుకునే రుణ చెల్లింపు చరిత్రను సూచిస్తుంది. రుణాలు చెల్లించడంలో విఫలమయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాంకులకు రిస్క్ తక్కువ ఉంటుంది. అందువ‌ల్ల క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువ నిర్వహించే వ్యక్తులకు బ్యాంకులు రుణాలు, క్రెడిట్ కార్డుల‌ను సులభంగా మంజూరు చేస్తాయి.

CIBIL స్కోర్ ని తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా ఈజీగా చెక్ చేసుకోచ్చు..!

700-749..

మీ సిబిల్ స్కోర్ ఈ పరిధిలో ఉంటే, మీ రుణ చరిత్ర బాగానే ఉందని అర్ధం. అయితే, బ్యాంకులు రుణ దరఖాస్తు తర్వగానే ఆమోదిస్తాయి. అయితే, తక్కువ వడ్డీ రేటు కోసం బ్యాంకును సంప్రదించాలంటే మరింత స్కోరును పెంచుకోవడం అవసరం కావచ్చు.

600-699..

ఈ శ్రేణిలో సిబిల్ స్కోర్ ఉంటే.. సకాలంలో బకాయిలను చెల్లించడానికి మీరు ఇబ్బంది పడుతున్నారని అర్థం. రిస్క్ పెరుగుతుంది. దీంతో బ్యాంకులు రుణం మంజూరు చేయడానికి ఆలోచిస్తాయి. ఈ స్థాయిలో క్రెడిట్ స్కోరు ఉన్నా పర్వాలేదు కానీ  ఇంతకంటే తక్కువకు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించాలి. 

CIBIL Score: తక్కువగా ఉండి రుణం పొందడం ఎలా..? స్కోర్‌కు లోన్‌కు సంబంధం ఏమిటి..?

350 - 599...

ఈ పరిధిలోని సిబిల్ స్కోరు ప్రమాదకర స్థాయిని సూచిస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లులు, రుణాలు సమయానికి చెల్లించడంలో విఫలం అవుతున్నారని అర్థం. ఈ శ్రేణిలో సిబిల్ స్కోరు ఉంటే..రిస్క్ అధికంగా ఉంటుంది కాబట్టి బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు రుణాలు, క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు విముఖత చూపుతాయి.  

ఎన్ఏ/ ఎన్‌హెచ్‌(NA/NH)..

క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తులకు సిబిల్ స్కోరు NA/NH గా చూపిస్తుంది. క్రెడిట్ కార్డు ఉపయోగించని లేదా మునుపెన్నడూ రుణం తీసుకోని వ్యక్తులకు క్రెడిట్ చరిత్ర ఉండదు. 

చివరిగా..

రుణాలు సులభంగా లభించాలన్నా, తక్కువ వడ్డీ రేటుకే పొందాలన్నా మంచి క్రెడిట్ స్కోరును నిర్వహించడం చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు క్రెడిట్ కార్డు బిల్లులను, తీసుకున్న రుణాలను సమయానికి చెల్లించండి. అలాగే మీ రుణ వినియోగ నిష్పత్తి(మీకు లభించిన పరిమితి లో మీరు వాడుకున్న శాతం) 30 శాతం మించకుండా చూసుకోవ‌డం మంచిది.  

ALSO READ: 

మీ స్కూల్ dise కోడ్ తో అమ్మఒడి 2022 అర్హుల జాబితా డౌన్లోడ్ చేసుకోండి  

Amma vodi 2022 : Grievances, Six Step Validation 

అమ్మఒడి పథకం పైన HMs కు ఒక అవగాహన

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad