Curryleaves Benefits: కరివేపాకే కదా అని పక్కన పడేస్తున్నారా ? ఎంత ఉపయోగమో తెలుసా !

Curryleaves Benefits: కరివేపాకే కదా అని పక్కన పడేస్తున్నారా ? ఎంత ఉపయోగమో తెలుసా !


సాధారణంగా వంట రుచి పెంచడంలో కరివేపాకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో కరివేపాకు ఉండాల్సిందే. కానీ.. చాలా మంది కరివేపాకును తినడానికి ఇష్టపడరు.. వంటకాల్లో ఉపయోగించినా కానీ..తినే సమయంలో మాత్రం పక్కన పడేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కరివేపాకును చాలా చోట్ల తీపి వేప అని కూడా అంటారు. నెట్ మేడ్ నివేదిక ప్రకారం కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మెగ్రీషియం, జింక్, మల్టీవిటమిన్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.. ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు రక్తహీనత, మధుమేహం, అజీర్ణం, ఊబకాయం, మూత్రపిండాల సమస్యలు, జుట్టు , చర్మ సమస్యలను నయం చేయడంలో సహయపడుతుంది.


ప్రయోజనాలు.. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది..జీర్ణ క్రియను మెరుగు పరచడమే కాకుండా.. కడుపు సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. దీంతో తల తిరగడం, వాంతులు, విరేచనాలు సమస్యలు తగ్గుతాయి.

శరీర పెరుగుదలను పెంచుతుంది..

 కరివేపాకులు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని బిల్డింగ్ బ్లాక్స్ పెరుగుదలకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి కండరాలు దృఢంగా మారుతాయి.

ఎముకలను దృఢంగా చేస్తుంది.

ఇందులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. దీన్ని రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గిపోయి దంతాలు దృఢంగా ఉంటాయి.


జుట్టు, చర్మం, నోటి ఆరోగ్యానికి.. 

కరివేపాకు అనేక రకాల సమస్యలను తగ్గిస్తుంది. దీంతో చేసే నూనెలు జుట్టు, చర్మం, నోటికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.

డయాబెటిస్ నియంత్రిస్తుంది.. 

రక్తంలోని చక్కర స్థాయిని నియంత్రించడంలో కరివేపాకు సహయపడుతుంది. అలాగే రక్తహీనతతో బాధపడేవారు కరివేపాకును తీసుకోవడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తం లేకపోవడం సమస్యను తగ్గిస్తుంది.

ALSO READ: 

పుచ్చకాయ కట్‌ చేయకుండానే ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా..?

ఎండకాలంలో రాగి జవ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు

సబ్జా గింజలతో ఈ సమస్యలన్నీ మటుమాయం

ఇంటర్ అయ్యాక ఏ ఏ కోర్స్ లు చదవచ్చు.. వివరాలకు

టెన్త్ అయ్యాక విద్యార్థులు ఏ ఏ కోర్స్ లు చదవాలి .. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి  ? 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad