NPS: ఈ విధంగా చేస్తే నెలకి రూ.50 వేలు పెన్షన్..!

 ఈ విధంగా చేస్తే నెలకి రూ.50 వేలు పెన్షన్..!


ప్రతీ ఒక్కరు కూడా రిటైర్ అయ్యాక పెన్షన్ ని పొందాలని అనుకుంటూ వుంటారు. మీరు కూడా రిటైర్ అయ్యాక మంచిగా పెన్షన్ ని పొందాలనుకుంటున్నారా..? అయితే తప్పకుండ మీరు ఇలా చెయ్యాలి. ఉద్యోగంతో పాటే రిటైర్‌మెంట్ ప్లానింగ్ చేసుకోవడం ఎంతో అవసరం. ఇప్పటి నుంచి మీ వేతనంలో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఫ్యూచర్ లో పెన్షన్ వస్తుంది.

 READ: ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే 40 ఏళ్ల నుంచే పెన్షన్

అయితే రిటైర్‌మెంట్‌ తర్వాత మెరుగైన రిటర్నులను అందించే ఆప్షన్లలో నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా ఒకటి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ మెంట్ చేయడం ద్వారా మీరు నెలకు రూ.50 వేల పైన పెన్షన్‌గా పొందవచ్చు. ఎన్‌పీఎస్‌లో 30 ఏళ్ల వాళ్ళు ప్రతీ నెలా రూ.10 వేలు 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.36 లక్షల పైన అవుతుంది.

 READ: మీ డబ్బులు 5 ఏళ్లలో డబుల్ కావాలంటే ఈ 5 స్కీమ్స్ ఎంచుకోండి.

దీనిపై 10 శాతం రిటర్నులను లెక్క లోకి తీసుకుంటే రిటైర్‌మెంట్ సమయంలో ఈ మొత్తం రూ.2.53 కోట్లవుతుంది. ఈ కార్పస్‌లో 40 శాతాన్ని యాన్యుటీ లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. యాన్యుటీ తీసేస్తే చేతిలోకి రూ.కోటిన్నరకు పైగా వస్తాయి.

యాన్యుటీలో పెట్టిన మొత్తంతో ప్రతి నెలా రూ.50 వేలపైన పెన్షన్‌గా వస్తుంది. దీనితో మీరు మంచిగా డబ్బులు పొందొచ్చు. మీరు ఆధారపడాల్సినవసరం రాదు. యాన్యుటీ రిటర్నులు 6 శాతంగా ఉంటున్నాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. రెండు లక్షల వరకు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

ALSO READ: 

LIC:  కొత్త ప్లాన్ వచ్చేస్తోంది.. మెచ్యురిటీలో ఎక్కువ డబ్బు

LIC introduces Savings Life Insurance Plan, Dhan Rekha (Plan 863)

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad