Oil Prices : భారీగా తగ్గిన సిలిండర్ ధర, పెట్రోల్,డీజిల్ ధరలు..లీటర్ పై రూ.9 తగ్గింపు

 Oil Prices : భారీగా తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు..లీటర్ పై రూ.9 తగ్గింపు


 
Oil Prices : కేంద్ర ప్రభుత్వం శనివారం, మే 21, పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Oil Prices :  దేశ ప్రజలకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. కొద్ది రోజులుగా భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఉపశమనం కలిగించేలా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం(Central Excise Duty)తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం శనివారం(మే 21) పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ సుంకాన్ని తగ్గించడం ద్వారా వాహనదారులకు భారీ ఊరట లభించింది. దీంతో లీటరు పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గుతుందని ఆమె తెలిపారు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ప్రతిఏటా దాదాపు రూ.1 లక్ష కోట్ల వరకు ఆదాయం తగ్గిపోనుంది.

ఇక, తగ్గిన ఎక్సైజ్ సుంకం రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. 

LPG Price Drop : సిలిండర్ ధరలపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను రూ.200 త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇది కొంద‌రికి మాత్ర‌మే అని ష‌ర‌తులు విధించింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌కు (12 సిలిండర్ల వరకు) రూ. 200 సబ్సిడీని అందిస్తామ‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. దేశంలోనే ఎందరో మ‌హిళ‌ల‌కు సాయం చేస్తుంద‌ని ఆమె అన్నారు. తాజా తగ్గింపుతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రూ.1003గా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.800కు దిగిరానుంది.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad