Prasanth Kishor: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్‌ కిషోర్‌.. రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటన

 Prasanth Kishor: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్‌ కిషోర్‌.. రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటన

Prasanth Kishor Politicas: ఇన్నాళ్లూ తెరవెనక ఉండి నడిపించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌..ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ఎలక్షన్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌. రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. బీహార్‌ నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. జన్‌ సురాజ్‌ దిశగా అడుగులు వేస్తున్నానని వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికల సంఘం దగ్గర ఆయన పార్టీ పేరును రిజిస్టర్‌ చేసినట్టు చెబుతున్నారు.

పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందిస్తూ అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని వెల్లడించారు. ఇప్పుడు ప్రజల సమస్యలు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడం కోసం ప్రజలకు చేరువవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని..ఆ క్రమంలో సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నానని ప్రకటించారు.


కాంగ్రెస్‌లో చేరాలని, ఎంపవర్డ్‌ గ్రూప్‌ సభ్యుడిగా ఉండాలన్న ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతిపాదనను తిరస్కరించారు పీకే. కాంగ్రెస్‌తో చర్చలు బెడిసికొట్టాక సొంత పార్టీ దిశగా అడుగులు వేశారు. పీకేకు పలు రాజకీయా పార్టీలతో సత్సంబంధాలున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేయడంతో పీకే పేరు దేశమంతా మార్మోగింది. ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించడం దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

బీహార్‌లోని కిషోర్‌ రోహ్తాస్‌ జిల్లాలోని కోనార్‌ ప్రశాంత్‌ కిషోర్‌ సొంతూరు. తండ్రి శ్రీకాంత్ పాండే సాధారణ వైద్యుడు. వృత్తి రీత్యా బీహార్ లోని బక్సార్లో నివాసముందేవారు. బక్సార్ లోనే పీకే రాజకీయ పాఠాలు చదువుకున్నాడు. అక్కడ నుంచి ఎదిగిన పీకే ..ఎన్నికల వ్యూహకర్తలలో ఒకరుగా తయారయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్ల పాటు ఐక్యరాజ్యసమితిలో సేవలందించారు పీకే.

2013లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్‌ను స్థాపించాడు ప్రశాంత్ కిషోర్. 2012లో గుజరాత్‌లో మూడవసారి మోదీ అయ్యేందుకు తన వంతు సలహాలు, సూచనలు అందించారు. 2014 లోక్ సభ ఎన్నికలలో మోడీ నేతృత్వంలోని బీజేపీ మెజారిటీకి తన వంతు సహకారం అందించాడు ప్రశాంత్ కిషోర్. 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకంగా మీడియా ప్రచార సంస్థ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మోదీ టీమ్ కు దూరమయ్యారు పీకే.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad