SBI ALERT: SBI ఖాతాదారులకు అలర్ట్‌, మీకు ఈ మెసేజ్‌ వచ్చిందా!

SBI ఖాతాదారులకు అలర్ట్‌, మీకు ఈ మెసేజ్‌ వచ్చిందా!

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? మీ బ్యాంక్‌ అకౌంట్‌లను బ్లాక్‌ చేస్తామని  మెసేజ్‌లు వస్తున్నాయా?అయితే అప్రమత్తంగా ఉండండి అంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. 

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? మీ బ్యాంక్‌ అకౌంట్‌లను బ్లాక్‌ చేస్తామని  మెసేజ్‌లు వస్తున్నాయా?అయితే అప్రమత్తంగా ఉండండి అంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

కేవైసీ సబ్మిట్‌ చేయకపోతే అకౌంట్‌లను బ్లాక్‌ చేస్తామని వస్తున్న మెసేజ్‌లపై కేంద్రం అప్రమత్తమైంది.ఈజీ మనీ కోసం సైబర్‌ నేరస్తులు ఎస్‌బీఐ ఖాతాదారుల్ని టార్గెట్‌ చేశారు. వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంతేకాదు అనుమానాస్పద వ్యక్తులు కాల్‌ చేసినా,మెయిల్స్‌ పెట్టినా రిప్లయి ఇవ్వొద్దని తెలిపింది. ఒకవేళ ఎవరైనా పొరపాటున వచ్చిన మెసేజ్‌లకు సమాధానాలు ఇచ్చి ఉంటే report.phishing@sbi.co.in కు మెయిల్‌ చేయాలని తెలిపింది.

ఇప్పుడు రెండో సారి..

డియర్‌ కస్టమర్‌ మీ ఎస్‌బీఐ బ్యాంక్‌ డాక్యుమెంట్లకు కాలం చెల్లింది. అందుకే ఆర్బీఐ గైడ్‌ లైన్స్‌ ప్రకారం 24గంటల్లోపు కేవైసీ సబ్మిట్‌ చేయండి. అందుకోసం మేం పంపిన లింక్స్‌ క్లిక్‌ చేసి మీ వ్యక్తిగత వివరాల్ని ఎంటర్‌ చేయండి అంటూ సైబర్‌ నేరస్తులు ఓ లింక్‌ను ఎస్‌బీఐ ఖాతాదరులకు పంపిస్తున్నారు. ఇలా పంపడం ఇదే తొలిసారి కాదని, ఈ ఏడాది మార్చిలో ఒకసారి ఈ తరహా లింక్స్‌ పంపినట్లు ఎస్‌బీఐ అధికారికంగా తెలిపింది. అకౌంట్‌ హోల్డర్లు ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్త ఉండాలని హెచ్చరించింది. అనుమానం ఉంటే బ్యాంక్‌ అధికారుల్ని సంప్రదించాలని ట్వీట్‌లో పేర్కొంది.

ALSO READ:

 అమ్మఒడి పథకం 2022 తాజా  ఉపయోగకరమైన సమాచారం

SBI లో భారీగా ఉద్యోగాలు! నెలకు రూ. 41వేల జీతం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి 

 Google Read Along App.. మే నెలలో  స్టోరీ ల రోజువారీ లిస్ట్

 SBI Loan Offer: SBI అదిరిపోయే ఆఫర్ 

APGLI వారి అఫిషియల్ ఫైనల్ పేమెంట్ కాలిక్యులేటర్

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad