ఏపీ ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో రూ.800కోట్లు మాయం...


 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డ‌బ్బు విత్ డ్రా

సోమ‌వారం రాత్రి నుంచే ఉద్యోగుల‌కు మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌న్న సూర్య‌నారాయ‌ణ‌

దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని వెల్ల‌డి

6 నెలల పీఆర్సీ డీఏ బ‌కాయిల‌ను లాగేశారంటూ ఆవేద‌న‌

రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ

AP  government employees alleges cash in their pf accounts withdrawn with out their consent

ఏపీ ఉద్యోగులు మంగళవారం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉద్యోగులకు చెందిన పీఎఫ్ ఖాతాల నుంచి తమకు తెలియకుండానే పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేశారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని 90 వేల మంది ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి తమకు తెలియకుండా రూ.800 కోట్లు డ్రా చేశారని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. పీఆర్సీ బకాయిల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం నిధులను వెనక్కి తీసుకున్నట్లుగా ఉందన్నారు.

ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నిధులు డ్రా చేసినట్లు సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు రాత్రి నుంచి ఉద్యోగులకు మెసేజ్ లు వస్తున్నాయన్నారు. డబ్బులు ఎవరు తీసుకున్నారో కూడా తెలియడం లేదని ఆరోపించారు. తన ఖాతా నుంచి రూ.83 వేలు డ్రా అయినట్లు తెలిపారు. గతంలో ఇలాంటివి జరిగితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశానని, అలాంటిదేదో జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.

మీ PF బ్యాలెన్స్‌ని ఇక్కడ చెక్ చేసుకోండి

సూర్యనారాయణ మాట్లాడుతూ పీఆర్సీ డీఏ బకాయిలను పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం గతంలోనే చెప్పిందని తెలిపారు. 6 నెలలుగా జమ అయిన పీఆర్సీ డీఏ బకాయిలు ఇప్పుడు వెనక్కి వచ్చాయి. ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆర్థిక శాఖ అధికారులు లేరన్నారు. ఈ లావాదేవీ గురించి ప్రభుత్వానికి తెలుసా? అధికారులు ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు.

తమ అనుమతి లేకుండా వారి ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయడం నేరమని సూర్యనారాయణ అన్నారు. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మార్చిలో జరిగిన లావాదేవీల గురించి కూడా చెప్పకపోవడం సరికాదన్నారు. తమ అనుమతి లేకుండా వారి ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసుకునే సాంకేతికత చట్టబద్ధం కాదా అని ప్రశ్నించారు.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad