Google Search : గూగుల్‌లో 241543903 తో ఎప్పుడైనా సెర్చ్ చేశారా.?

 SEARCH FOR  241543903 IN GOOGLE

Google Search : గూగుల్‌లో 241543903తో ఎప్పుడైనా సెర్చ్ చేశారా.? దాని వెనుక రహస్యం ఏంటో చుడండి.. 

 

ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. అంతా డిజిటల్ మయమైపోవడంతో.. అన్నింటికీ ఇంటర్నెట్‌లోనే సెర్చ్ చేసేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా సెర్చ్ ఇంజిన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ బాగా పాపులర్. ఏది సెర్చ్ చేయాలన్నా ఎక్కువ మంది గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోనే వెతుకుతున్నారు. అయితే గూగుల్‌లో మీరెప్పుడైనా 241543903 నెంబర్‌తో సెర్చ్ చేశారా.? ఏం వస్తుందో చూశారా.? అసలు సంగతి తెలుసుకుంటే షాక్ కావడం ఖాయం.

SEARCH FOR  241543903 IN GOOGLE: మీరు 241543903తో నెంబర్‌తో గూగుల్‌లో సెర్చ్ చేయగానే.. ఆ నెంబర్‌తో కూడిన కొన్ని ఫోటోలు దర్శనమిస్తాయి. అందులో ఉన్న వ్యక్తులు తమ తలను ఫ్రీజర్‌లో పెట్టినట్లు మీరు చూడవచ్చు. ఇంతకీ ఈ నెంబర్ స్ట్రాటజీ అసలు ఎలా మొదలైందంటే.. 2009లో న్యూయార్క్‌కు చెందిన ఆర్టిస్ట్ డేవిడ్ హార్విట్జ్ దీన్ని మొదటిగా స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో అతడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ Tumblr ద్వారా నెటిజన్లకు ఓ ఛాలెంజ్ విసురుతూ.. తన తలను ఫ్రీజర్‌లో పెట్టి ఫోటో తీసి.. ఆ ఫోటోను నెట్టింట్లో పోస్ట్ చేశాడు. దానిపై 241543903 నెంబర్ రాశాడు. ఇక అతడి ఫాలోవర్స్ కూడా ఆ టైప్ ఫోటోలనే పోస్ట్ చేశారు. ఆ నెంబర్ ట్రెండ్ ఇలాంటి ఫోటోలు చాలా రోజులు కొనసాగింది. అందుకే ఇప్పటికీ ఆ నెంబర్‌తో గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. ఫ్రీజర్‌లో తల పెట్టిన ఫోటోలే వస్తాయి. ఆ ఫోటోలు, నెంబర్ వెనుక ఉన్న అసలు విషయం ఇదే..

 READ: Vizag Cruise Service: క్రూయిజ్ షిప్‌లో ప్రయాణమంటే స్వర్గంలో విహారమే!..సౌకర్యాలు చూస్తే షాక్ అవుతారు!

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad