దేశీయ టెలికాం కంపెనీలు ఈ ఏడాది టారిఫ్ ధరల్ని పెంచేందుకు ప్రయత్నాలు మమ్మరం చేస్తున్నాయి. అంతకంటే ముందే జియో తన యూజర్లకు భారీ షాకిచ్చింది. ప్రత్యేకంగా జియో ఫోన్ నెక్ట్స్ యూజర్లకు అందిస్తున్న మూడు రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది
జియో ఫోన్ నెక్ట్స్ ప్రీపెయిడ్ ప్రారంభ రీఛార్జ్ ప్లాన్‌లు గతంలో రూ.155, రూ.185, రూ.749 ఉండేవి. తాజాగా పై 3 ప్లాన్‌ల ధరల్ని 20శాతం పెంచింది. ఇప్పుడు ఆ ప్లాన్ ధరలు ఎలా ఉన్నాయంటే? రూ.155 రీఛార్జ్ ప్లాన్ కాస్తా రూ.186కి పెరిగింది. రూ.185 ప్లాన్ భారీగా రూ.222కి చేరింది. ఇక రూ.749 ప్లాన్ ప్రస్తుతం రూ.899తో అందుబాటులో ఉంది. ఈ మూడు ధరల్ని పెంచినట్లు జియో సైతం తన అధికారిక వెబ్ సైట్‌లో పేర్కొన్నట్లు పలు నివేదికలు తెలిపాయి.
జియో ఫోన్ నెక్ట్స్ ప్లాన్‌లు
రిలయన్స్ సంస్థ జియో ఫోన్ నెక్ట్స్ పేరుతో కొనుగోలు దారులకు బడ్జెట్ ధరలో ఫీచర్ ఫోన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే జియో సంస్థ ఆ ఫోన్‌కు ప్రత్యేకమైన వివిధ టారిఫ్ ధరల్ని అందిస్తుంది. ఇప్పుడు ఆ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పెరిగిన ప్లాన్స్‌తో అందించే బెన్ఫిట్స్ ఇవే
జియో ఫోన్ నెక్ట్స్ యూజర్లకు అందిస్తున్న రూ.186 బేసిక్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు 1జీబీ డేటాను అందిస్తుంది. వాయిస్ కాల్స్ తో పాటు 100ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు
రూ.222ప్లాన్:
28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌లో యూజర్లు ప్రతిరోజు ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌తో 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. అదే విధంగా వాయిస్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు సెండ్ చేసుకోవచ్చు.
రూ.899 ప్లాన్:
336రోజుల వ్యాలిడిటీతో 24జీబీ డేటాను పొందవచ్చ. ఈ ప్లాన్ 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. వ్యాలిడిటీతో పూర్తయితే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు 50 ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
ALSO READ:
జీయో సూపర్ ప్లాన్.. రు . 151 కె మూడు నెలల డేటా
Reliance Jio: బంపర్ ప్లాన్స్ ప్రకటించిన jio
జియో అదిరిపోయే బంపరాఫర్, రూ.200కే '14 ఓటీటీ' యాప్స్