Star Anise: జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు అనాస పువ్వు అద్భుతమైన ఔషధం..

 Star Anise: జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు అనాస పువ్వు అద్భుతమైన ఔషధం..

Star Anise: భారతీయుల వంట ఇల్లే ఓ మెడికల్ షాప్.. పోపుల పెట్టే ఓ ఔషధాల గని. ముఖ్యంగా సీజనల్ వ్యాధులైన జలుబు, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి శారీరక సమస్యలకు ఇంట్లో ఉండే మసాలా దినుసులే మంచి మెడిసిన్. ఈ విషయం  ఆయుర్వేద వైద్యుని వద్దకు వెళ్లినా మసాలా దినుసుల ఉపయోగం గురించి తెలుస్తుంది. ఈ మసాలా దినుసులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. ఈజీగా సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. పులావ్‌లు, బిర్యానీలు.. నాన్ వెజ్ వంటి ఆహారపదార్ధాలను తయారు చేసే సమయంలో మసాలా పదార్ధాలను ఉపయోగిస్తుంటారు. వాటిల్లో అనాస పువ్వు ఒకటి. దీనిని స్టార్‌ అనిస్‌ అని కూడా అంటారు. మంచి సుగంధబరితమైన వాసనతో పాటు రుచి ఉండే ఈ అనాస పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  అనాస పువ్వు వలన కలిగే లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

READ: ఇంగ్లీష్ spelling test విద్యార్థులు మరియు ప్రతి ఒక్కరూ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు

కంటి సమస్యలకు చక్కటి నివారిణి అనాస పువ్వు. దీనిలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును పెంచుతుంది.

*దీనిలో విటమిన్‌ సి కూడా ఉంటుంది. కనుక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. జ్వరం వచ్చినవారు ఈ పువ్వుని తీసుకుంటే త్వరగా జ్వరం తగ్గుతుంది.

*ఈ పువ్వులో థైమోల్‌, టెర్పినోల్‌ అనబడే సమ్మేళనాలు ఉన్నాయి. కనుక శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. కఫన్నీ తగ్గిస్తుంది.

* వికారం, వాంతుల సమస్యకు చక్కటి పరిష్కారం అనాస పువ్వు.

*రుతుక్రమం సమయంలో ఇబ్బంది పడే మహిళలకు మంచి రెమిడీ అనాస పువ్వు.. అధిక రక్తస్రావాన్ని అరికట్టడమే కాదు.. కడుపు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

*అనాస పువ్వు మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.

*మలబద్దకం, జీర్ణ సమస్యలు, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నవారికి చక్కటి మెడిసిన్ అనాస పువ్వు

* సీజనల్ సమస్యల నుంచి ఉపశమనం కోసం.. అనాస పువ్వును నీటిలో వేసి మరిగించి రోజూ ఒక కప్పు నీటిని తాగాలి. రోజులో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఈ అనాసపువ్వు నీటిని తాగినా ప్రయోజనం కలుగుతుంది.

ALSO READ:

మీ S.R. లో అన్ని ఎంట్రీస్ ఉన్నాయా?

మీ PF ఖాతా లో ఉన్న బాలన్స్ ఎంతో  తెలుసుకోండి

ఒక్క నిమిషం లో మీ తెలుగు భాష మీద పట్టు తెలుసుకోండి..

Departmental  పరీక్షలకి అవసరం ఆగు అన్ని రకాల మెటీరియల్.. బుక్స్ pdfs

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad