SBI Clerk: నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్ .. భారీ నోటిఫికేషన్ విడుదల

 SBI Clerks Notification 2022 

బ్యాంక్(Bank) ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో గుడ్‌న్యూస్ చెప్పనుంది. 2022 సంవత్సరానికి సంబంధించిన క్లర్క్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఎస్బీఐ ఈ నెలలో ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. అంటే మరో రెండు వారాల్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. SBI క్లర్క్ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ వివరాల కోసం అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ sbi.co.in ని CHECK చేస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే తేదీలు, పరీక్ష విధానం, అర్హతలు, ఇతర ముఖ్యమైన అప్‌డేట్స్ అన్నీ SBI క్లర్క్ 2022 నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. క్లర్క్ రిక్రూట్‌మెంట్ పరీక్షను స్టేట్ బ్యాంక్ రెండు దశల్లో నిర్వహిస్తుంది. మొదటి దశలో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. తర్వాత LPT పేరుతో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.

SYLLABUS

ప్రిలిమ్స్ పరీక్షల సిలబస్‌లో 3 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ సెక్షన్లు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ ఎగ్జామ్‌లో నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది

QUALIFICATIONS: 

SBI క్లర్క్ పోస్ట్‌కు విద్యా అర్హత గ్రాడ్యుయేషన్. ఏదైనా గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్‌లో ఉన్న అభ్యర్థులు కూడా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. SBI క్లర్క్ పోస్టుకు కనీస వయోపరిమితి 21 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిపై సడలింపు ఉంటుంది. ఈ వివరాలను SBI క్లర్క్ నోటిఫికేషన్‌లో పేర్కొంటారు

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad