భారత త్రివర్ణ పతాకం గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
Indian National Flag.
Indian National Flag Quiz: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఆగస్టు 15, 2022తో 75 వసంతాలు పూర్తి కానున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ప్రతీ ఇంటిపై ఎగురవేయాలని పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా అందరికీ త్రివర్ణ పతాకం అందేలా చర్యలు సైతం తీసుకుంది. అయితే.. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో భాగంగా.. మేము మీకు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాము.. భారత త్రివర్ణ పతాకాన్ని తెలుగు వ్యక్తి, స్వాతంత్ర్య సమర యోధులు పింగళి వెంకయ్య రూపొందించారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. త్రివర్ణ పతాకం గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసో.. లేదో.. ఒకసారి చెక్ చేసుకోండి..