JIO మరో సంచలనం! 12 వేలకే 5G స్మార్ట్‌ఫోన్‌

 Reliance Jio 5G Phone: JIO మరో సంచలనం! 12 వేలకే 5G స్మార్ట్‌ఫోన్‌

ముంబై:  రిలయన్స్ జియో మరో సంచలనానికి సన్నద్ధమవుతోంది. భారతదేశంలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను  తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌పై హింట్‌ ఇచ్చినప్పటికీ, అంతకుమించి వివరాలను వెల్లడించారు. అయితే సరసమైన ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ వినియోగదారులకు అందించనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

గత ఏడాది రిలయన్స్ జియో , గూగుల్ సంయుక్తంగా జియో ఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇపుడు ఆగస్ట్ 29న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  వార్షిక సాధారణ సమావేశంలో ఈ 5 జీస్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయవచ్చని అంచనా..

JIO ఫోన్ 5G ధర: అంచనా

5జీ జియో ఫోన్ ధర సుమారు  12 వేల రూపాయల లోపునే ఉండనుందట. అలాగే జియో ఫోన్ నెక్స్ట్ మాదిరిగానే, వినియోగదారులు  రూ. 2500  డౌన్ పేమెంట్ చేసి ఫోన్‌ను  సొంతం చేసుకోవచ్చని మార్కెట్‌ వర్గాల్లో  ఊహాగానాలు  విరివిగా ఉన్నాయి.గతంలో లాగానే ఈఫోన్‌ కొనుగోలు చేసినవారికి అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తో పాటు ఇతర బంపర్‌ ఆఫర్లను అందించనుందట జియో.పూర్తి వివరాలు అధికారంగా ప్రకటించేంతవరకు సస్పెన్స్‌ తప్పదు.!

JIO  5జీ ఫోన్ ఫీచర్లు

6.5 అంగుళాల HD డిస్‌ప్లే

ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480  సాక్‌ ప్రాసెసర్‌ 

4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌

13ఎంపీ ప్రైమరీ సెన్సార్‌+2 ఎంపీ డ్యూయల్ కెమెరా 

8ఎంపీ సెల్ఫీ కెమెరా

ALSO READ

రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్

Jio, Airtel :కేవలం రూ.91కే అపరిమిత కాల్స్ మరియు 3 GB డేటా

JIO  నుండి మరో బెస్ట్ ప్లాన్..రూ.395. అపరిమిత ప్రయోజనాలు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad