SBI స్వాతంత్య్ర దినోత్సవ కానుక: కొత్త స్కీం

Utsav Fixed Deposit Scheme: కస్టమర్లకు ఎస్బీఐ స్వాతంత్య్ర దినోత్సవ కానుక: కొత్త స్కీం


 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  75  సంవత్సరాల భారత స్వాతంత్ర్య దినోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో  భాగంగా ఖాతాదారులకు ఒక కొత్త పథకాన్ని లాంచ్‌ చేసింది. "ఉత్సవ్ డిపాజిట్" అనే ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంలో అధిక వడ్డీరేట్లను ఆఫర్‌ చేస్తోంది. అయితే ఇది  పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ ఒక ట్వీట్‌లో వెల్లడించింది.

ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో, 1000 రోజుల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 6.10శాతం వడ్డీ రేటును అందిస్తోంది.  సీనియర్ సిటిజన్లు సాధారణ రేటు కంటే 0.50శాతం అదనపు వడ్డీ రేటును పొందేందుకు అర్హులు. ఈ రేట్లు 15 ఆగస్టు 2022 నుండి అమలులోకి వస్తాయి.  ఇది 75 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad