Heavy Rains : AP లో భారీ నుంచి అతిభారీ వర్షాలు: మరో మూడు రోజులు వానలేవానలు

 ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు: మరో మూడు రోజులు వానలేవానలు .. ఈ జిల్లాల్లో జాగ్రత్త!

విశాఖ: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy rains) పడే అవకాశం ఉందని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి (Visakha East Godavari) జిల్లాలు, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. అల్పపీడన ప్రభావం వల్ల తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారుల హెచ్చరించారు. వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అలాగే దక్షిణ ఒడిశా, తెలంగాణ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమతీరాన్ని ఆనుకొని కొనసాగుతున్న మరో ద్రోణి ప్రభావంతో.. కర్ణాటక, మహారాష్ట్ర (Karnataka Maharashtra)లోనూ అక్కడక్కడ వర్షాలు పడుతాయని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. 

కాగా, ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగాం, యాద్రాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. 

సిరిసిల్ల, కరీంనగర్‌, నల్లగొండ, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad