NEW MEO POSTS : ఉమ్మడి సీనియార్టీ ప్రకారం ఎంఇఒ పోస్టులు

ఉమ్మడి సీనియార్టీ ప్రకారం ఎంఇఒ పోస్టులు 

ప్రధానోపాధ్యాయుల సంఘం డిమాండ్

అమరావతి బ్యూరో రాష్ట్రప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న మండల విద్యాశాఖ అధికారి (ఎంఇఒ) పోస్టులను ఉమ్మడి సీనియార్టీ ప్రకారం నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జివి నారాయణ రెడ్డి, వి శ్రీనివాసరావు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్కుమార్కు ఆదివారం లేఖ రాశారు. విద్యాశాఖ మంజూరు చేసిన 672 పోస్టుల పని విభజనకు సంబంధించిన నిబంధనలను రూపొందించలేదని తెలిపారు. సర్వీస్ రూల్స్ రూపొందించి పని విభజనపై స్పష్టత ఇచ్చిన తర్వాతే ప్రస్తుతం పనిచేస్తున్న ఎంఇవోలను, ప్రధానోపాధ్యాయులను ఆప్షన్ అడగాలని కోరారు. 3శాతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు, 97శాతం పనిచేస్తున్న జిల్లా పరిషత్, మున్సిపల్ ఉపాధ్యాయులకు ఈ పోస్టులను ఏ విధంగా విభజిస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇంటర్ విద్య ప్రవేశపెట్టిన 292 పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లకు లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు.

ఉమ్మడి నిబంధనల ప్రకారం మార్గదర్శకాలు : APTF 

MEO పోస్టుల నియామకాలకు ఉమ్మడి నిబంధనల ప్రకారం మార్గదర్శకాలు విడుదల చేయాలని ఎపిటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యరద్ములు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసును పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ స్ఫూర్తికి ఏమాత్రం ఇబ్బంది జరిగినా వెంటనే కార్యాచరణకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

 పోస్టులు రద్దు చేసి MEO పోస్టులా?: TNUS

1145 పోస్టులను రద్దు చేసి ఎంఇఒ పోస్టులు సృష్టించడం సరికాదని TNUS  అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలకు తగినన్ని ఎసిటి పోస్టులు లేకుండా తనిఖీ అధికారులు దేనికని ప్రశ్నించారు.

MEO పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాతే.. 

కొత్తగా అప్ గ్రేడ్ చేసిన 679 ఎంఈవో పోస్టుల భర్తీకి సరైన మార్గదర్శ కాలు విడుదల చేసిన తర్వాతే ప్రక్రియ ప్రారంభించాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకుండా ప్రధానో పాధ్యాయుల నుంచి ఆప్షన్ తీసుకోవడం అనుమానాలకు దారి తీస్తోందని చెప్పారు. 'ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్ల ఉమ్మడి సర్వీసు పరిగణనలోకి తీసుకుని ఎంఈవో 1, 2 నియామకాలు చేపట్టాలి. కొత్త ఎంఈవో పోస్టులను భర్తీ చేసే క్రమంలో ఇప్పటివరకు సర్వీసులో ఉన్న సీనియర్ ఎంఈవోలకు బదిలీలు పూర్తి చేయాలి. ఉమ్మడి సర్వీసు రూల్స్ స్ఫూర్తికి ఇబ్బంది జరిగితే వెంటనే కార్యాచరణకు పిలుపునిస్తాం' అని వారు పేర్కొన్నారు

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad