PMSBY: సంవత్సరానికి కేవలం రూ.20.. మీ జీవితానికి గొప్ప భద్రత.. వెంటనే ఈ పథకంలో చేరండి..

 PMSBY: సంవత్సరానికి కేవలం రూ.20.. మీ జీవితానికి గొప్ప భద్రత.. వెంటనే ఈ పథకంలో చేరండి..

PMSBY: దేశంలోని అనేక మంది పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక బీమా పథకాలను అందిస్తోంది. కుటుంబంలోని ఓ పెద్ద వ్యక్తి అనుకోకుండా ప్రాణాలు కోల్పోతే.. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అందుకే చాలా తక్కువ ప్రీమియంతో అనేక బీమా పథకాలను అందిస్తోంది. వీటిలో ఒకటి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతుండగా, వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితితో పాటు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పేద, మధ్య తరగతి ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదిక ప్రకారం దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2020 నుంచి 2021 వరకు ప్రమాదాలు 16.8 శాతం పెరిగాయి. 2021లో రోడ్డు ప్రమాదాల్లో 1,55,622 లక్షల మంది చనిపోగా, అదే ఏడాది 4,03,116 రోడ్డు ప్రమాదాల్లో 3,71,884 మంది గాయపడ్డారు. ప్రైవేట్ కంపెనీల్లో బీమా తీసుకోవాలంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది బీమా తీసుకోరు. అలాంటి వారికి అతి తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది.

#  Pradanmantry Surakhsa Bheema Yojana

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనలో చేరిన వ్యక్తి రూ. 20 డిపాజిట్ చేయడం ద్వారా రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకంలో చేరే వ్యక్తులు బ్యాంకులో పొదుపు ఖాతా కలిగి ఉండాలి. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అధికారిక వెబ్‌సైట్ లేదా ఇక్కడ ఉన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా నేరుగా వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ పథకం కోసం దరఖాస్తు ఫారమ్‌ను పొందవచ్చు. దరఖాస్తులో పొందుపరిచిన వివరాలను పూర్తి చేసి, అవసరమైన పత్రాల కాపీలను జతచేసి బ్యాంకుకు సమర్పించాలి. ఈ పథకానికి ఖాతా నుంచి రూ.20 తీసుకుంటారు.

ఎవరు అర్హులు: 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద ఎవరైనా లబ్ధిదారుడు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మృతుని కుటుంబ సభ్యులు రూ.2,00,000 ఆర్థిక సహాయం పొందవచ్చు. ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ. బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉన్న వారు ఈ పథకంలో చేరవచ్చు.

క్లెయిమ్ విధానం: ఏదైనా ప్రమాదం కారణంగా పథకంలో నమోదు చేసుకున్న లబ్ధిదారుడు మరణించిన సందర్భంలో, వ్యక్తి యొక్క నామినేటెడ్ బ్యాంక్ మరియు బీమా కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా క్లెయిమ్ ఫారమ్ నింపాలి. బీమా చేసిన వ్యక్తి తన పొదుపు ఖాతాను కలిగి ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో బీమా చేసిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీమా కవర్ మొత్తం నామినీ ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది.

CLICK HERE FOR MORE INFORMATION

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad