Teacher Transfers Schedule Today: నేడు టీచర్ల బదిలీ ఉత్తర్వులు?


» ఎనిమిదేళ్ల సర్వీసుకు అంగీకారం

» ఎట్టకేలకు షెడ్యూలు విడుదలకు నిర్ణయం 

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి) ఊపాద్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న బదిలీల షెడ్యూలు విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సోమవారం బదిలీలకు సంబంధించిన ఉత్త ర్వులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలి సింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. బదిలీలకు గరిష్ట సర్వీసును ఎనిమిదేళ్లకు పెంచింది. దీనికి సీఎంవో అంగీకారం తెల పగా ఈ ఫైలు పాఠశాల విద్య శాఖ కమి షనరేట్కు చేరింది. 

దీంతో బదిలీల ష్యూలు విడుదలకు అధికారులు కసరత్తు ప్రారం భించారు. కాగా ఈ ఏడాది బదిలీలు రకరకాల మలుపులు తిరిగాయి. బదిలీలు చేయాలని నిర్ణయిం చిన ప్రభుత్వం సర్వీసును ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు కుదించింది. దీనిపై టీచర్లలో వ్యతిరేకత వ్యక్తమైనా దానిపై ముందుకెళ్ళింది. కానీ అదిగో ఇదిగో అంటూ షెడ్యూలు మాత్రం విడుదల చేయలేదు. ఇలా రెండు నెలలకు పైగా కాలం గడిపిన ప్రభుత్వం చివరికి ఐదేళ్ల నిర్ణయంపై వెనకడుగు వేసి ఎప్పటిలాగే ఎని మిదేళ్ల సర్వీసు ప్రామాణికంగా తీసుకుంది.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad