టీచర్ కి గుండు తెచ్చిన తంటా .. పాపం ఉద్యోగం పోయింది.

 టీచర్ కి గుండు తెచ్చిన తంటా .. పాపం  ఉద్యోగం పోయింది.


గుండు తెచ్చిన తంటా ఉద్యోగం మీదికొచ్చింది. సమస్యలు తీర్చాలని దేవుడి గుడికెళ్లి గుండు గీయించుకొని మొక్కు చెల్లించుకున్న ఫలితానికి తన ఉద్యోగానికే ఎసరు వచ్చింది. ఏకంగా జాబ్ నుంచి సస్పెండైన సదరు ప్రభుత్వ టీచర్.. తన జీవనాధారాన్ని పోగొట్టుకున్నారు. ఆ వివరాలు

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మేళాపురం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆదినారాయణ అనే ఉపాధ్యాయుడు గత నెల 5వ తేదీన కర్ణాటకలోని పావగడ శనేశ్వర స్వామి ఆలయానికి గుండు కొట్టించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లాడు. ఆ తర్వాత యథావిధిగా విధులకు హాజరయ్యేందుకు పాఠశాలకు వచ్చి ఫేషియల్ యాప్‌కు హాజరయ్యారు. కానీ సెల్ఫీ తీసుకునేటప్పుడు, మునుపటి రిజిస్ట్రేషన్ ఫోటో ఒకేలా లేనందున, ఈ ముఖం మీది కాదని యాప్ తిరస్కరిస్తుంది. ఉపాధ్యాయుడు ఆదినారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ ఘటనపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయింది. ప్రభుత్వంపై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు.

దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడు ఆదినారాయణకు ఈ నెల 17న మెమో జారీ చేశారు. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చాడు. ఆ వివరాలను పత్రికలకు లీక్ చేయలేదని వాపోయారు. అయితే ఆదినారాయణను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నతాధికారులకు చెప్పి సమస్యను పరిష్కరించాల్సిన ఉపాధ్యాయుడు.. మీడియాకు ఏం చెప్పాలని అధికారులు సీరియస్ అయ్యారు. తాజాగా అతడిని సస్పెండ్ చేస్తూ డీఈవో మీనాక్షి ఉత్తర్వులు జారీ చేశారు. యాప్‌లోని తప్పులను సరిదిద్దకుండా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడానికి ఉపాధ్యాయ సంఘాలు నివ్వెరపోతున్నాయి.

SOURCE: TV9telugu.com

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad