'టీచర్ల' బదిలీలల్లో అదనపు పాయింట్లు
హేతుబద్ధీకరణ ద్వారా స్థానాలు కోల్పోయిన ఉపాధ్యాయులకు బదిలీల్లో అదనంగా ఐదు పాయింట్లు కేటాయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
అమరావతి: రేషనలైజేషన్ ద్వారా పోస్టులు కోల్పోయిన ఉపాధ్యాయులకు బదిలీల్లో ఐదు అదనపు పాయింట్లు కేటాయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలల మ్యాపింగ్‌తో సంబంధం లేకుండా ఈ అదనపు పాయింట్లను పొందేలా వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఒక్కొక్కరికి ఐదు పాయింట్లు కేటాయించేలా వెబ్‌సైట్‌లో మార్పులు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు శనివారం తెలిపాయి.
Also Read: మీ ట్రాన్సఫర్ అప్లికేషన్ లో తప్పులు ఉన్నాయా..సరిచేయాలా
బదిలీల షెడ్యూల్ పొడిగింపు
ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. ఆదివారం ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఇవ్వగా, దరఖాస్తుల పరిశీలనకు 20వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్ష 19న ముగియాల్సి ఉండగా 20 వరకు పొడిగించారు.
Also Read: Transfers Online Apply link