లేటెస్ట్ గా వావ్ అనిపించే ఓ యువకుడి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన గాత్రానికి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. సరదా పాటలు పాడుతున్న ఆ కుర్రాడి గురించి సినీ ప్రముఖులు ఆరా తీస్తున్నారు
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి ఎన్నో మట్టి మాణిక్యాలు పరిచయం అవుతున్నాయి. చాలా మంది తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా లక్షలాది మంది ఇంటర్నెట్ ద్వారా తమ ప్రతిభను ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతున్నారు. ఇప్పటికే ఈ సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలో చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. Youtube, Instagram, Facebook ద్వారా కోట్లాది మందికి తమ టాలెంట్‌ను చూపుతూ ఒక్కసారిగా ఫేమస్ అవుతున్నారు. ముఖ్యంగా అద్భుతమైన గాత్రం.. పాటలను అందంగా.. రాగయుక్తంగా పాడే గాయకుల గురించి మనం చూస్తూనే ఉంటాం. లేటెస్ట్ గా వావ్ అనిపించే ఓ యువకుడి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన గాత్రానికి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. సరదా పాటలు పాడుతున్న ఆ కుర్రాడి గురించి సినీ ప్రముఖులు ఆరా తీస్తున్నారు.
బీహార్‌కు చెందిన అమర్‌జిత్ జయకర్ అనే యువకుడు 2004 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ మస్తీలోని దిల్ దే దియా పాటను పాడి అందరి హృదయాలను దోచాడు. బీహార్‌లోని సమస్తాపూర్‌కు చెందిన అమర్‌జిత్ జయకర్ 'దిల్ దే దియా' పాటను ఉదయం సెల్ఫీ తీసుకుంటూ పాడాడు. తన గ్రామంలో పొలం. ప్రొఫెషనల్ సింగర్స్ లాగా అందంగా పాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి వీడియో చూసిన నెటిజన్లు మట్టిలో మాణిక్యం.. గ్రేట్ ఫ్యూచర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక అమర్జిత్ ఆ వీడియోను నటి నీతూ చంద్ర శ్రీవాస్తవ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ఆహా అద్భుతంగా పాడారు. ఎవరీ అబ్బాయి అబ్బాయి నాకు కాంటాక్ట్ నంబర్ కావాలి అని క్యాప్షన్ ఇచ్చారు. అలాగే అమర్‌జిత్ పాడిన ఇతర పాటలపై నటుడు సోనూసూద్ కూడా స్పందించారు. అతని అందమైన స్వరం మీరూ వినండి..!
बिहार के इस लड़के ने अपने सुरों से दिल जीत लिया, क्या सुरीली आवाज़ है 👌#Bihar pic.twitter.com/vynhN1q9Bs
— Aapna Bihar (@Aapna__Bihar) February 21, 2023