Teacher Transfers: ఇక నుంచి ఐదేళ్లకే టీచర్ల బదిలీ..!

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఉపాధ్యాయుల బదిలీ లకు గరిష్టపరిమితి ఐదేళ్లుగా పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ఆదేశాలు ఇస్తామన్నారు. విజయవాడలో సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సోమవారం చర్చలు జరిపారు. ఉపాధ్యాయులు అడిగిన పలు అంశాలపై ఆయన సాను కూలంగా స్పందించారు. 

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని, ఒత్తిడికి గురికావొద్దని అన్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ సందర్భంలో జరుగుతున్న అంశాలను పరిశీలిస్తా మన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన షోకాజ్ పర్యవేక్షణ సందర్భంగా ఇచ్చిన నోటీసులకు సంబంధించి పరిశీలన చేసి తగు న్యాయం చేస్తామని తెలిపారు. అవసరమైతే ప్రతి ఉన్నత పాఠశాలలో ఒక డిజిటల్ అసిస్టెంట్ను నియమిస్తామని చెప్పారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి సర్వీస్ రూల్స్ డ్రాప్ను అందిస్తామని, దీనిపై సవరణలు ఈ నెల 30వ తేదీలోపు ఇవ్వాలని కోరారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతామన్నారు.

Download Updated IMMS App 1.5.6 (20.03.2023)

మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లు కూడా సర్వీస్ రూల్స్ రూపొందించిన అనంతరం ఇస్తామని, మిగిలిన పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల పర్యవేక్షణ సందర్భంగా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన చార్జ్ మెమోలను సస్పెన్షన్లను ఎత్తివేయాలని యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఎస్ఆఇఆర్టి డైరెక్టర్ ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార శాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, జాయింట్ డైరెక్టర్లు మువ్వా రామలింగం, మేరిచంద్రిక, ఎపిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ఎన్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హెచ్ తిమ్మన్న, సాయి శ్రీనివాస్, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad