SBI News: SBI శుభవార్త.. ఖాతాదారులకు ఇక బ్యాంకులకు వెళ్లకుండా కొత్త సేవలు..!

 SBI News: SBI శుభవార్త.. ఖాతాదారులకు ఇక బ్యాంకులకు వెళ్లకుండా కొత్త సేవలు..!

State Bank of India | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్న దిగ్గజ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సమాయత్తమవుతోంది. దీంతో వినియోగదారులకు మేలు జరుగుతుంది.

ఐరిష్ స్కానర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని SBI భావిస్తోంది. దీని వల్ల సీనియర్ సిటిజన్లు ఎక్కువ ప్రయోజనం పొందుతారని చెప్పవచ్చు. పింఛన్‌ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు సులభంగా పెన్షన్ పొందవచ్చు.

Also Readబంపరాఫర్‌.. సగం ధరకే Hindware  ఎయిర్‌ కూలర్‌..!

కొంతమంది సీనియర్ సిటిజన్లకు వేలిముద్రలు సరిగా పడకపోవచ్చు. అలాంటి వారికి పింఛను పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఐరిష్ స్కానర్ సేవలను SBI అందుబాటులోకి తీసుకురానుంది.


బ్యాంకింగ్ కరస్పాండెంట్లు లేదా సర్వీస్ కస్టమర్ పాయింట్ల వద్ద ఐరిష్ స్కానర్ సేవలు అందుబాటులో ఉండేలా SBI తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే బ్యాంకు ఖాతాదారులకు మరో ప్రయోజనం చేకూరనుంది.

సీనియర్ సిటిజన్స్ బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు. సమీపంలోని బ్యాంకింగ్ మిత్ర ఛానెల్‌కు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది చాలా సౌకర్యవంతమైన నిర్ణయం అని చెప్పవచ్చు.

Also Read: SBI నుంచి మళ్లీ కొత్త పథకం.. కస్టమర్లకు మరింత లాభం

సీనియర్ సిటిజన్లు లేదా కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీసీ లేదా సీఎస్పీ (బ్యాంక్ మిత్ర)లో ఐరిష్ స్కానర్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సమాయత్తమవుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది.

అయితే తాజాగా ఓ సంఘటన జరిగింది. సీనియర్ సిటిజన్ పెన్షన్ మొత్తాన్ని విత్‌డ్రా చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బ్యాంకులో వేలిముద్ర పడకపోవడంతో సీనియర్‌ సిటిజన్‌ పింఛన్‌ డబ్బుల కోసం కుర్చీ పట్టుకుని చెప్పులు లేకుండా బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది.

ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. మానవత్వంతో మెలగాలని సూచించారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

Also Read:  వేసవి తాపాన్ని తట్టుకునే 7 ఆహారాలివే !

ఈ క్రమంలో ఆమెకు SBI ఉచితంగా వీల్ చైర్ ను అందించింది. ఇంటి వద్దకే పింఛను అందజేస్తామని హామీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు బ్యాంక్ మిత్ర లేదా సర్వీస్ పాయింట్లకు సంబంధించిన నిబంధనలను కూడా సవరిస్తున్నట్లు SBI వెల్లడించింది.

అయితే, కొత్త సేవలు ప్రధానంగా సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పవచ్చు. దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా పింఛను సొమ్మును సులభంగా పొందొచ్చు.

Also Read: 

1.AP లో రెండు రోజులు ఆ జిల్లాల ప్రజలకు నిప్పులే

2కస్టమర్ల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన Google Pay

3నెలకి నాలుగు వేలు ఇచ్చే SBI స్కాలర్ షిప్ లు 

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad