13 రోజుల్లో రూ.7కు పైగా పెరిగిన పెట్రోల్ ధరలు, గ్లోబల్ మార్కెట్లో జూమ్



పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 13వ రోజు పెరిగాయి. జూన్ 7వ తేదీ నుండి వరుసగా ధరలు పెరగడంతో ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ పైన రూ.7.11, లీటర్ డీజిల్ పైన రూ.7.67 పెరిగింది. ఈ రోజు (జూన్ 19, శుక్రవారం) పెట్రోల్ లీటర్ పైన 56 పైసలు, డీజిల్ పైన 63 పైసలు పెరిగింది. కరోనా-లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్షిస్తున్న కంపెనీలు ప్రతి రోజు పెంచుతున్నాయి.

వివిధ నగరాల్లో ధరలు వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. 

  1. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.78.37, డీజిల్ రూ.77.06, 
  2. కోల్‌కతాలో పెట్రోల్ రూ.80.13, డీజిల్ రూ.72.53, 
  3. ముంబైలో పెట్రోల్ రూ.85.21, డీజిల్ రూ.75.53, 
  4. చెన్నైలో పెట్రోల్ రూ.81.82, డీజిల్ రూ.74.77గా ఉంది. 
  5. హైదరాబాద్‌లో నేడు లీటర్ పెట్రోల్ రూ.81.36, డీజిల్ రూ.75.31గా, 
  6. అమరావతిలో పెట్రోల్ రూ.81.76, డీజిల్ రూ.57.73, 
  7. విజయవాడలో పెట్రోల్ రూ.81.36, డీజిల్ రూ.75.36గా ఉంది.
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad