ఇండియాలోని టెలికామ్ రంగంలో అధిక సంఖ్యలో వినియోగదారులను కలిగిన ఎయిర్‌టెల్ మరియు
జియోలు తమ వినియోగదారులకు ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో అద్భుతమైన డేటా ప్రయోజనాలను
అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది వినియోగదారులు 1.5GB రోజువారీ డేటా
ప్లాన్‌లను ఇష్టపడుతున్నారు.
ఇండియాలో 2GB డైలీ డేటా ప్లాన్‌లు కరోనా కారణంగా ఇంటి వద్ద నుండి పనిచేస్తున్న
చాలామందికి ఈ రోజువారి డేటా సరిపోక దీని కంటే అధిక డేటాను అందిస్తున్న ప్లాన్‌లతో
రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఇటువంటి వారికోసం ఈ రెండు టెల్కోలు తమ వినియోగదారులకు
రోజువారి 2GB డేటా ప్లాన్‌లను కూడా అందిస్తున్నారు. భారతి ఎయిర్‌టెల్ మరియు
రిలయన్స్ జియో నుండి రోజువారీ 2GB డేటాను అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క
చెల్లుబాటు 28 రోజుల నుండి ఒక సంవత్సరం వరకు ఉన్నాయి. రిలయన్స్ జియో 2GB రోజువారీ
డేటా ప్రయోజనంతో ఇటీవల మరికొన్ని ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది.
ఎయిర్‌టెల్ రూ.2498 ప్రీపెయిడ్ ప్లాన్
భారతి ఎయిర్‌టెల్ సంస్థ అధిక ధర వద్ద
అందిస్తున్న ప్లాన్ ఇది. ఈ ప్లాన్ రోజువారీ 2GB డేటా బెనిఫిట్‌ను 365 రోజుల
చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. దీనితో పాటుగా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్
మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీటితో పాటు మరిన్ని అదనపు
ప్రయోజనాలు కూడా ఉన్నాయి
ఎయిర్‌టెల్ రూ.698 ప్రీపెయిడ్ ప్లాన్
భారతి ఎయిర్‌టెల్ వినియోగదారులు మూడు నెలల
చెల్లుబాటుతో అద్భుతమైన ప్రయోజనాలను కోరుకుంటున్న వారికి ఇది సరైన ఎంపిక. ఈ
ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో రోజువారీ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు
రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ .449 ప్రీపెయిడ్ ప్లాన్
రెండు
నెలల చెల్లుబాటు కాలంతో రోజువారీ అధిక డేటా ప్రయోజనాలను కోరుకుంటున్న వారికి ఈ
ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఇది 56 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటా,
రోజుకు100 SMS ప్రయోజనాలతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనంను కూడా
అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్
2GB
రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తున్న ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
డేటా ప్రయోజనంతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను
కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇది ఒక సంవత్సరం
అమెజాన్ ప్రైమ్ వీడియో చందాను ఉచితంగా అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ.298 ప్రీపెయిడ్ ప్లాన్
ఎయిర్‌టెల్ సంస్థ 2GB రోజువారీ డేటాను తక్కువ ధరలో అందిస్తున్న ప్లాన్ లలో ఇది
మొదటిది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్
కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తున్నది.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ల అదనపు ప్రయోజనాలు ఎయిర్‌టెల్ యొక్క 2GB రోజువారీ
డేటాను అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్లు అన్ని కూడా ఎయిర్‌టెల్ థాంక్స్
బెనిఫిట్‌తో వస్తాయి. ఈ ప్రయోజనాలలో ZEE5 ప్రీమియం, వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్
ఎక్స్‌స్ట్రీమ్, షా అకాడమీ యొక్క ఉచిత ఆన్‌లైన్ క్లాసులు, ఉచిత హెలోటూన్స్ వంటివి
కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ఫాస్ట్ ట్యాగ్ యొక్క లావాదేవీలపై 150 రూపాయలు క్యాష్
బ్యాక్ కూడా పొందుతారు.
జియో రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్
జియో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ లాంగ్-టర్మ్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో
లభిస్తుంది. ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటా, అపరిమిత జియో - టూ - జియో కాల్స్ మరియు
12000 FUP నిమిషాల నాన్-జియో కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను
అందిస్తుంది. ఇదే కాకుండా పరిచయ ఆఫర్లో భాగంగా 10GB డేటాను కూడా అదనంగా
అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది డిస్నీ +
హాట్‌స్టార్ సభ్యత్వాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది.
జియో రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్
జియో ఒక సంవత్సరం చెల్లుబాటుతో వస్తున్న రెండవ ప్లాన్ ఇది. ఇది తన 365 రోజుల
చెల్లుబాటు కాలంలో 2GB రోజువారీ డేటాతో పాటు జియో - టూ - జియో అపరిమిత వాయిస్
కాల్స్ మరియు 12000 FUP నిమిషాల నాన్-జియో కాలింగ్ మరియు రోజుకు 100 SMS
ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
మూడు నెలల చెల్లుబాటుతో వినియోగదారులకు అందిస్తున్న ఈ ప్లాన్ అద్భుతమైన
ప్రయోజనాలను అందిస్తున్నది. ఈ ప్లాన్ తన 84 రోజుల చెల్లుబాటు కాలంలో 2GB రోజువారీ
డేటాతో పాటు అపరిమిత జియో కాల్స్ మరియు 3000 FUP నిమిషాల నాన్-జియో కాల్స్ మరియు
రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది.
జియో రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్
జియో సంస్థ తక్కువ
ధరలో రోజువారి 2GB డేటాను అందిస్తున్న ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో
లభిస్తుంది. ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటా ప్రయోజనంతో పాటు అపరిమిత జియో వాయిస్
కాలింగ్ మరియు 1000 FUP నిమిషాల నాన్-జియో కాల్స్ మరియు రోజుకు 100SMS
ప్రయోజనాలను అందిస్తుంది. పైన తెలిపిన అన్ని ప్లాన్లు కూడా అన్ని రకాల జియో యాప్
ల కాంప్లిమెంటరీ చందాను ఉచితంగా అందిస్తాయి.