TS: కనుమరుగు కాబోతున్న MRC... మరియు మండల విద్యాశాఖధికారి వ్యవస్థ

తెలంగాణ న్యూస్
కనుమరుగు కాబోతున్న MRC... మరియు మండల విద్యాశాఖధికారి  వ్యవస్థ
ఒక జ్ఞాపకం గా మిగిలిపోనుందా ... ! అవునని సమాధానం వస్తుంది తెలంగాణలో ఈ నెల నుండి  డ్రాయింగ్ అండ్ disbursing  పవర్స్ అన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు బదలాయింపుకు శ్రీకారం చుట్టబడింది 

💥వివరాల్లోకి వెళితే 1998 నుండి యూని ఫికేషన్ రూల్స్ కోర్టులో పెండింగ్ ఉండడంవల్ల తెలంగాణలో రెగ్యులర్ ఎం ఈ ఓ అందరూ రిటైర్ అవ్వడం, మరియు  పనిచేస్తున్నవారు 5% పర్సెంట్ మాత్రమే ఉండడంవల్ల అన్ని  *ఎంఈఓ పోస్టులకు సీనియర్ ప్రధానోపాధ్యాయులను FAC గా నియమించడం* వల్ల విద్యా వ్యవస్థ గాడితప్పే ప్రమాదం ఉందని *గత సంవత్సరం కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అందరూ ఉపాధ్యాయులను ఆ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పరిధిలోకి తీసుకువస్తూ జీవోలు ఇవ్వడం జరిగింది కానీ ఈ నెల నుండి  ఉపాధ్యాయుల జీతభత్యాలు చెల్లింపులు అన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది *దీనివల్ల మండల రిసోర్స్ సెంటర్ మరియు మండల విద్యాశాఖ అధికారి వ్యవస్థ కనుమరుగయ్యే విషాదకర సన్నివేశాలు ఉత్పన్నం అవుతున్నాయి*

💥గవర్నమెంట్ & పంచతీరాజ్ ఉపాధ్యాయులు మంకుపట్టు పట్టి ఇప్పటివరకు  జఠిలం చేసి వ్యవస్థ నిర్వీర్యం అయ్యేందుకు కారణభూతులు అయ్యారు ఇప్పుడు ఇరువురు సాధించింది ఏమిటి ? కోల్పోతున్నది ఏమిటో గ్రహించండి  !! మీ వల్ల వ్యవస్థ భూస్థాపితం అయిపోయే పరిస్థితి తెలంగాణలో ఆవిష్కృతమైంది💥
కానీ  ఆంధ్రప్రదేశ్లో 2017 సంవత్సరంలో రెగ్యులర్ ఎం ఈ ఓ లు గా నియమించడం వల్ల ఇక్కడ  ఈ వ్యవస్థ ఊపిరి పీల్చుకుంది, (మరియు ఉప విద్యాశాఖాధకారి పోస్ట్ కూడా రద్దు కు రంగం సిద్ధమైనట్లు గా తెలుస్తోంది) లేనిచో తెలంగాణకు పట్టిన గతి మనకు ఆవిష్కృతం అయ్యేది ఇప్పటికైనా *గవర్నమెంటు ఉపాధ్యాయులు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు సమన్వయ పరుచుకుని కోర్టు కేసును పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే🤝 *భావితరాలకు మండల వనరుల కేంద్రం మండల విద్యాధికారి వ్యవస్థ* మన ఆంధ్రప్రదేశ్ లో మనగలుగుతుంది లేనిచో తెలంగాణ పరిస్థితి మనకు ఉత్పన్నమవుతుంది విజ్ఞతతో వ్యవహరించమని అందరిని కోరుతూ ఆవేదనతో

👉అవును మీరు హెడ్డింగ్ కరెక్ట్ గానే చదివారు.
👉 మండల విద్యా వనరుల కేంద్రం(MRC) ప్రతి ఉపాధ్యాయునికి సుపరిచితం. మరి అది ఒక జ్ఞాపకంగా మిగలనుంది.

👉 కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ముందుగా వెళ్లి జాయిన్ అయ్యేది MRC లోనే.
👉అంతే కాక ప్రధానోపాధ్యాయుల సమావేశాలు, శిక్షణలు అన్ని కూడా MRC లోనే జరుగుతాయి.
👉అంటే ఉపాధ్యాయుల అందరికీ మండల స్థాయిలో హెడ్ ఆఫీస్ MRC యే.
👉MEO గారు DDO గా ఉంటూ మండల స్థాయిలో ఉపాధ్యాయుల పర్యవేక్షణ చేస్తూ, వారి సమస్యలను తీరుస్తూ ఉండేవారు.
👉ఇపుడు ఇంక MRC స్థానంలో CRC పర్యవేక్షణ భాద్యతలను స్వీకరిస్తుంది. కాంప్లెక్స్ HM యే DDO గా ఉంటారు.
👉 కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయుల సర్వీస్ మేటర్స్ అన్నీ కూడా వారే చూడాలి.
👉 ఇకపై ఏ మండలంలో పనిచేస్తున్నావు అనే వాక్యం పోయి, ఏ కాంప్లెక్స్ లో పనిచేస్తున్నావు అనే వాక్యం రానున్నది.
👉2017లోనే  తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోగా ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు వెనక్కు తగ్గింది.

👉ఇక 2019 డిసెంబర్ నుండి ఇదే మాట వచ్చినా కార్య రూపం దాల్చలేదు.
👉ఇటీవల కరోనా నేపథ్యంలో ఆలస్యమైంది.
👉 పర్యవేక్షణ పెంచటం కోసమో లేక ప్రమోషన్స్ లో MEO లను లేకుండా చేయటం కోసమో తెలియదు కానీ ఈ నెల జీతాలు మాత్రం కాంప్లెక్స్ HM లు చేయటం ఖాయమైంది
👉 ప్రతి ఉపాధ్యాయునికి MRC అత్యంత ఇష్టంగా ఉండేది.
👉 మరీ ముఖ్యంగా సీనియర్ ఉపాధ్యాయులకు MRC తో  చాలా అనుబంధం ఉండేది.
👉 ఒక పాఠశాల నుండి వేరే పాఠశాలకు బదిలీ పై వస్తే, గత పాఠశాల అనుబంధం గురించి భాదపడే ఉపాధ్యాయుడు....ఈ MRC బంధనాన్ని ఎలా తెంచుకుంటాడో చూడాలి.
👉 ఉపాధ్యాయుల గుండెల్లో భాదని,కళ్ళల్లో తడిని ఎంత వరకు ఆపుతుందో కాలమే చెబుతుంది
👉 అందుకే MRC ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది
ఆవేదనతో- ఉపాధ్యాయుడు🙏

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad