COVID-19 రోగుల అత్యవసర చికిత్స కోసం యాంటీ కాన్వల్సెంట్ డ్రగ్ రెమిడెసివిర్,
యాంటికాన్వల్సెంట్ డ్రగ్ టోసిలిజుమాబ్, అలాగే ప్లాస్మా చికిత్సను కేంద్ర ఆరోగ్య
మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. 'కోవిడ్ -19 కోసం క్లినికల్ మేనేజ్‌మెంట్
ప్రోటోకాల్'ను మంత్రిత్వ శాఖ తాజాగా సమీక్షించింది. ఇందులో కొత్త గైడ్ లైన్స్
విడుదల చేసింది.
యాంటీ మలేరియల్ డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ) వ్యాధి ప్రారంభంలో
వాడాలని, తీవ్రమైన సందర్భాల్లో వీటిని ఆపేయాలని పేర్కొంది. కొత్త ప్రోటోకాల్
ప్రకారం ఎమర్జన్సీ, ఐసియు అవసరం ఉన్న సందర్భంలో అజిత్రోమైసిన్ తో పాటు
హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడాలని గతంలో చేసిన సిఫారసును మంత్రిత్వ శాఖ
ఉపసంహరించుకుంది.
హైడ్రాక్సీక్లోరోక్విన్ క్లినికల్ వాడకంలో చాలా అధ్యయనాలు బాగా పనిచేస్తున్నట్లు
చూపించాయని ఇది తెలిపింది. అయితే సవరించిన ప్రోటోకాల్ ప్రకారం....'చాలా రీసెర్చ్
అధ్యయనాలు హెచ్‌సీక్యూ ఎలాంటి ప్రభావాన్ని, క్లినికల్ ఫలితాలను చూపించలేదని, ఇతర
యాంటీ వైరల్ మందుల మాదిరిగానే, దీన్ని వ్యాధి ప్రారంభంలో కూడా వాడాలి. అప్పుడే
ప్రభావం కనిపిస్తుందని, అయితే తీవ్రమైన అనారోగ్య రోగులకు దీనిని వాడకుండా చూడాలని
కొత్త గైడ్ లైన్స్ లో పేర్కొంది.
ఇక కోవిడ్ -19 చికిత్సలో రెమిడెసివిర్ అత్యంత యాక్టివ్ మందుగా పరిగణిస్తున్నారు.
ఈ ఔషధాన్ని అమెరికన్ ఔషధ సంస్థ గిలియడ్ సైన్సెస్ ఉత్పత్తి చేస్తుంది. భారత్ సహా
127 దేశాలకు కంపెనీ సరఫరా చేస్తుంది. ఇప్పుడు గిలియడ్ సైన్సెస్ భారతదేశంలోని
హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీదారు డాక్టర్ రెడ్డి ప్రయోగశాలతో ఒప్పందం
కుదుర్చుకుంది. రెండు కంపెనీల మధ్య నాన్-ఎగ్జిక్యూటివ్ ఒప్పందం కుదిరింది. దీని
ప్రకారం, గిలియడ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డిస్ కి రెమెడెసివిర్‌ను ఉత్పత్తి చేసే
హక్కును ఇచ్చింది.