నిరుద్యోగులకు good news

కరోనా కాలంలో జగన్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఏపీ ఆరోగ్యశాఖలో భారీగా పోస్టులు భర్తీ చేసేందుకు సన్నద్దమవుతోంది. ఈ నియామకాల్లో భాగంగానే జనరల్ అభ్యర్ధుల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పొడిగిస్తూ ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి మెమో జారీ చేశారు. ఇక 104 వాహనాల్లో, సీఎం ఆరోగ్య కేంద్రాల్లో 3 ఏళ్లు సర్వీసును పూర్తి చేసుకున్నవారికి సివిల్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో 15 శాతం వెయిటేజీని ప్రభుత్వం ప్రకటించింది.

గిరిజన ప్రాంతాల్లో పనిచేసివారికి ఏడాదికి 3 మార్కులు, రూరల్ ప్రాంతాల్లోని వారికి 2, అర్బన్ ప్రాంతాల్లో పని చేసినవారికి ఒక్క మార్కు వెయిటేజీ ఇచ్చింది. అలాగే సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో పీజీ పూర్తిచేసిన వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో 5 మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది.

665 సివిల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ…

ప్రజారోగ్యశాఖ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 665 సివిల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఖాళీలను MBBS విద్యార్హతతో భర్తీ చేయనున్నారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad