అమెరికా వెళ్లాలంటే కష్టమే.. H-1B వీసాలు నిలిపివేత



భారత ఐటీ నిపుణులకు షాక్: అమెరికా వెళ్లాలంటే కష్టమే.. హెచ్-1 బీ వీసాలు నిలిపివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1 బీ వీసాలను నిలిపివేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది జరిగితే, ఈ వీసా ద్వారా పనిచేయాలని కలలు కంటున్న భారతదేశంలో వేలాది మంది ఐటి నిపుణులుతో పాటు భారతదేశం చాలా నష్టపోతుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అమెరికాలో భారీగా నిరుద్యోగం రాబోతుంది. ఈ క్రమంలో హెచ్ 1 బి మరియు మరికొన్ని వీసాలను నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆ దేశ మీడియా నివేదికలు చెబుతున్నాయి.

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. H-1B మరియు కొన్ని ఇతర వీసాలకు ఈ ప్రతిపాదిత సస్పెన్షన్ కారణంగా అమెరికా బయట ఉన్న ఐటీ నిపుణులకు పెద్ద దెబ్బ కానుంది. ప్రతిపాదిత సస్పెన్షన్ అక్టోబర్ 1 నుంచి ఉండవచ్చునని చెబుతున్నారు. ప్రభుత్వ కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇది విస్తరించవచ్చునని అంటున్నారు. అయితే మళ్లీ హెచ్1బీ వీసాలు వచ్చేవరకు కొత్తరకం వీసాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లు మాత్రం ప్రభావితం అయ్యే అవకాశం లేదని నివేదిక చెబుతుంది. 

అయితే, దీనిపై వైట్ హౌస్ నుండి స్పష్టత వచ్చింది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని, పరిపాలనపరంగా వివిధ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని చెప్పింది. అయితే ఈ వార్తను మాత్రం వైట్ హౌస్ తన ప్రకటనలో ఖండించలేదు. దీంతో కరోనా కాలంలో భారతీయ నిపుణులకు ఇది సమస్యగా మారింది. 

అమెరికాలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని, అమెరికాలో నిరుద్యోగ స్థాయి రికార్డును దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఉండడంతో.. నిరుద్యోగం సమస్యపై ప్రతిపక్షాలు కూడా ట్రంప్‌ను ప్రశ్నిస్తున్నాయని, కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad