కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. కేంద్ర హోం శాఖ 1522 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కేంద్ర సాయుధ బలగాల్లో ఓ విభాగమైన సశస్త్ర సీమా బల్‌లో ఈ పోస్టులున్నాయి. డ్రైవర్, ల్యాబ్ అసిస్టెంట్, వెయిటర్, కార్పెంటర్, ప్లంబర్, గార్డెనర్ లాంటి ట్రేడ్స్‌లో మొత్తం 1541 కానిస్టేబుల్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు త్వరలో సశస్త్ర సీమా బల్-SSB అధికారిక వెబ్‌సైట్ http://www.ssbrectt.gov.in/ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్‌లో విడుదలవుతుంది. ప్రకటన విడుదలైన 30 రోజుల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
SSB Constable Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 1522
డ్రైవర్- 574
ల్యాబ్ అసిస్టెంట్- 21
వెటర్నరీ- 161
ఆయా (మహిళలు)- 5
కార్పెంటర్- 3
ప్లంబర్- 1
పెయింటర్- 17.
టైలర్- 20
కోట్లర్- 20
గార్డెనర్-9
కుక్ మేల్- 237,
కుక్ పీమేల్- 26
వాషర్‌మ్యాన్ మేల్- 92
వాషర్‌మ్యాన్ ఫీమేల్- 28
బార్బర్ మేల్-75
బార్బర్ ఫీమేల్- 12
సఫాయివాలా మేల్-89
సఫాయివాలా ఫీమేల్- 28
వాటర్ క్యారియర్ మేల్- 101
వాటర్ క్యారియర్ ఫీమేల్- 12
వెయిటర్ మేల్-1
SSB Constable Recruitment 2020:
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 30 రోజులు
వేతనం- రూ.2.1700 ను రూ.69100
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్ససర్వీసెమెన్, మహిళలకు ఫీజు లేదు.