INDIAN DATING APP.. QUACK.. QUACK.

డేటింగ్.. పాశ్చాత్యంలో కామన్ అయిన ఈ సంస్కృతి ఇప్పుడు దేశంలోనూ విచ్చలవిడిగా వేళ్లూనుకుంది. ఆడ మగ పెళ్లికాకుండానే కలిసి ఉండడం... నచ్చితే పెళ్లి చేసుకోవడం ఈ డేటింగ్ పరమార్థం. నచ్చకపోతే విడిపోవచ్చు. ఇప్పుడు పెళ్లి అయినా వారు తమకు ఇష్టమైన వారితో డేటింగ్ చేసేస్తున్నారు. ఒంటరిగా ఉండే వారంతా డేటింగ్ కోసం తపిస్తుంటారు. ఈ కొత్త సంస్కృతికి భారతీయులు ఎగబడుతున్నారు. కరోనా లాక్ డౌన్ వేళ కూడా దేశంలో డేటింగ్ పై ఆసక్తి పెరిగింది.

దేశీయ డేటింగ్ యాప్ ‘క్వాక్ క్వాక్’లో భారతీయ వినియోగదారుల సంఖ్య భారీగా పెరగడం విశేషం. తమ యాప్ లో భారత యూజర్లు కోటి దాటారని తాజాగా ఆ కంపెనీ ప్రకటించడం ఆసక్తి రేపింది. లాక్ డౌన్ వేళనే దాదాపు 10 లక్షల మంది ఈ యాప్ లో చేరారట.. ప్రతీరోజు 30లక్షల ప్రొఫైల్ వ్యూస్ వస్తున్నాయని కంపెనీ తెలిపింది.

భారత్ లో ఒంటరిగా ఉంటున్న వారి కోసం తాము స్వదేశీ డేటింగ్ యాప్ రూపొందించామని.. ఇవాళ 10 మిలియన్ల మందితో (కోటి) మాకంటూ సొంతంగా ఓ చిన్నపాటి కమ్యూనిటీ ఏర్పడిందని ఈ క్వాక్ క్వాక్ వ్యవస్థాపకుడు రవి మిట్టల్ ఆనందంగా తెలిపారు.

DOWNLOAD QUACK QUACK APP HERE

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad