G pay. Phone pe లలో ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్

 న్యూఢిల్లీ : >డిజిటల్ పేమెంట్ కంపెనీలు ఫోన్‌‌‌‌పే, గూగుల్ పే వంటి సంస్థలు యూపీఐ ద్వారా ఆటో డెబిట్ ఆప్షన్‌‌‌‌ను ఆఫర్ చేయాలని చూస్తున్నాయి. అంటే ఎలక్ట్రిసిటీ, మొబైల్ ఫోన్‌‌‌‌ బిల్లులు, ఈఎంఐలు, మీడియా సబ్‌ స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు వంటి నెలవారీ తప్పనిసరి పేమెంట్ల కోసం ఆటో డెబిట్ ఫెసిలిటీని కస్టమర్లు ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కోసం నేష నల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌‌‌‌పీసీఐ)తో కలిసి ఫోన్‌‌‌‌పే, గూగుల్ పేలు పనిచేస్తున్నాయని ఈ విషయం తెలిసిన ఇద్దరు బ్యాంకర్లు చెప్పారు.

‘గూగుల్ పే, ఫోన్‌‌‌‌పేలు రికరింగ్ పేమెంట్స్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పై పనిచేయడం ప్రారంభించాయి. నెలలోనే ఇది అందుబాటులోకి రానుంది’ అని బ్యాంకర్లలో ఒకరు చెప్పారు. ఈ పేమెంట్ అప్లికేషన్స్‌‌‌‌ను లక్షల కొద్దీ యూజర్లకు ఆఫర్ చేయడాని కంటే ముందు వీటిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై గూగుల్ పే, ఫోన్‌‌‌‌పేలు స్పందిం చలేదు. హెచ్‌ డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లతో కలిసి జులైలోనే ఎన్‌‌‌‌పీసీఐ రికరింగ్ పేమెంట్ ఫెసిలిటీని లాంఛ్ చేసింది. సుదీర్ఘ కాలం నుంచి వేచిచూస్తో న్న ఈ పేమెంట్ ఫీచర్ యూపీఐ యూజర్ సెట్ చేసి తప్పనిసరిగా చేయాల్సిన రికరింగ్ పేమెంట్‌‌‌‌కు అనుమతిస్తోంది. రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం, ఎన్‌‌‌‌పీసీఐ అభివృద్ధి చేసిన ఇన్‌‌‌‌స్టంట్ పేమెంట్ సిస్టమ్ రూ.2000 వరకు రికరింగ్ పేమెంట్లు మాత్రమే జరుపుకోవచ్చు.

యూపీఐ ఆటో డెబిట్ ఫీచర్.. రికరింగ్ పేమెంట్ ఫెసిలిటీస్‌‌‌‌లో మార్పులు తీసుకొచ్చింది. మర్చంట్లకు పేమెంట్స్ ప్రాసెస్‌‌‌‌ను సులభతరం చేసింది. 10కి పైగా బ్యాంక్‌‌‌‌లు ఈ పేమెంట్స్ ప్రాసెస్‌‌‌‌ను తెచ్చాయి. ఈ ఎకోసిస్టమ్‌‌‌‌లో మరిన్ని బ్యాంక్‌‌‌‌లు జాయిన్ కావాలనుకుంటున్నాయి. గూగుల్ పే, ఫోన్‌‌‌‌పేలు కూడా పెద్ద మొత్తంలో యూజర్లకు ఈ ఆప్షన్‌‌‌‌ను తెస్తున్నాయి. ఈ రెండు యాప్స్‌‌‌‌కు 60–70 మిలియన్ మంది యూజర్లున్నారు. ఆటో డెబిట్ ఫీచర్ కోసం యూజర్లు ఒకసారి యూపీఐ పిన్ ద్వారా ట్రాన్సాక్షన్‌‌‌‌ను తప్పనిసరిగా అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పిరియడ్‌ ను ఎంపిక చేయాలి. ఆ తర్వాత రెగ్యులర్‌ గా ట్రాన్సాక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ప్రస్తుతం ఉన్న రూ.2,000 లిమిట్‌‌‌‌ను రెగ్యులేటరీ మరింత పెంచనుందని బ్యాంకర్లలో ఒకరు చెప్పారు. జూలైలో యూపీఐ 1.5 బిలియన్ ట్రాన్సాక్షన్స్‌‌‌‌ను రికార్డు చేశాయి. వీటి విలువ రూ.3 లక్షల కోట్లుగా ఉంది. దేశంలో డిజిటల్ చెల్లింపులలో గూగుల్, అమెజాన్ , ఫోన్ పే వంటి వాటి ద్వారా జరిపేవే ఎక్కువ అవుతున్నాయి. దీంతో అమెజాన్, గూగుల్, ఫేస్‌‌‌‌బుక్ లాంటి గ్లోబల్ టెక్నాలజీ ప్లేయర్లు ఇటు వైపు చూస్తున్నాయి.

Post a Comment

1 Comments

Top Post Ad

Below Post Ad