SP బాలూ ఆరోగ్యంపై భిన్న వార్తలు

ప్రముఖ గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉందని ఆస్పత్రి ప్రకటించిందని ఒక వైపు సమాచారం రాగా, మరో వైపు బాలు కుమారుడు తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా,నిలకడగా ఉందని చెప్పారు.

బాలు గత కొద్ది రోజులుగా కరోనాతో చెన్నై లోని ఎమ.జి.ఎమ్. ఆస్పత్రిలో చికిత్స పొందుతు్న్నారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రి వారు బాలు ఆరోగ్యం CRITICAL  గా ఉందని తెలిపారు. ఆ తర్వాత కాస్త BETTER అయిందని అన్నారు. తాజాగా మళ్లీ ఆస్పత్రి వారు బాలు ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని అన్నారని టీవీలలో వార్త వచ్చింది. 

అయితే ఆయన కుమారుడు చరణ్ మాత్రం వైద్యులు తనకు చెప్పిన దాని ప్రకారం ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు.త్వరలోనే ఆయన కోలుకుని తిరిగి వస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా రజనీకాంత్ తదితరులు బాలు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు ఇచ్చారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad